పబ్లిక్ థియేటర్ లో 'నాయక్' చూడనున్న రామ్ చరణ్
హైదరాబాద్: రామ్ చరణ్ తేజ తన తాజా చిత్రం నాయక్ ని తన అబిమానులతో పాటు చూడటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో సంధ్య 70 MMలో రిలీజ్ రోజు మార్నింగ్ షో రామ్ చరణ్ చూడనున్నారు. ఈ చిత్రం మొత్తం ఈ యూనిట్ ఈ షోకు అదే థియేటర్ కి హాజరు కానుంది. అదే సమయంలో రామ్ చరణ్ తన అభిమానులతో ఇంటరాక్ట్ కావటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే జనాల్ని కంట్రోలు చేయటం ఎంత వరకూ సాధ్యం అనే విషయాలు ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుని ప్లాన్ చేస్తున్నారు. అలాగే మిగతా థియేటర్స్ కి కూడా రామ్ చరణ్ తిరిగే అవకాసం ఉంది.
'ప్రజల కోసం ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం కోసం ప్రజలు కాదు..' అనేది 'నాయక్' చెప్పే మాట. ఇది రామ్‌చరణ్ హీరోగా నటించిన చిత్రం. కాజల్, అమలాపాల్ నాయికలు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. సెన్సార్ ధ్రువీకరణ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. 'ఎ' ధ్రువీకరణ పత్రం లభించింది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.
నిర్మాత మాట్లాడుతూ ''నాయకుడు ఎలా ఉండాలి? అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఒక బలమైన సామాజిక ఇతివృత్తం చుట్టూ అల్లుకొన్న కథ ఇది. రామ్‌చరణ్‌పై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు, ఆయన పలికిన సంభాషణలూ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తాయి. తమన్ స్వరాలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా 'శుభలేఖ రాసుకొన్నా', 'కత్తిలాంటి పిల్లా' అందరికీ నచ్చాయి'' అన్నారు. బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్‌రావత్ తదితరులు నటించారు. రచన: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్ సాయి.


Click it and Unblock the Notifications











