twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా నిర్ణయం: రామ్ చరణ్ కు ఇకపై పవర్ ఉండదా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామ్ చరణ్ ను ఇప్పటి వరకు అంతా మెగా పవర్ స్టార్ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసత్వంతో వచ్చాడంటూ....మొదట్లోనే ఆయనకు ‘మెగా పవర్ స్టార్' అనే బిరుదు డిసైడ్ చేసారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తన పేరు ముందు ఈ బిరుదు ఇష్ట పడటం లేదని తెలుస్తోంది. తాజాగా విడుదలైన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో టైటిల్స్ లో మెగా పవర్ స్టార్ అని వేయలేదు. దీన్ని బట్టి ఆయన ఈ ఇమేజ్ నుండి బయట పడాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

    రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఫ్యామిలీ పరమైన సమస్యలతో పాటు...ఎప్పుడూ ఒకే ఇమేజ్ తో ఉండకుండా తండ్రి బాటలో నడవాలనే కోరిక కూడా ఆయన ఈ ‘మెగా' నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. చిరంజీవికి కూడా మొదట్లో ‘సుప్రీం హీరో' అనే బిరుదు ఉండేది. ఆ తర్వాత ఆయన ‘మెగా స్టార్' అయ్యారు.

    Cherry Wishes to Change his Title?

    క్లాసు, మాసు, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ ఇలా అన్ని రకాల సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న రామ్ చరణ్.....వారసత్వంతో కాకుండా తన టాలెంటుకు తగిన విధంగా ఉండే బిరుదు కోసం ఎదురు చూస్తున్నారట. త్వరలో రామ్ చరణ్ కొత్త బిరుదు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.

    ఇక సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. త్వరలో ఆయన గౌతం మీనన్ దర్శకత్వంలో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.

    English summary
    ‘Mega Powerstar’ Ram Charan Teja left his title the other day. Fans were shocked when they saw that ‘Mega Powerstar’ title is missing during the starting credit of ‘Govindudu Andarivadele’. May be Charan has himself asked to drop the title because ‘GAV’ is an emotional and family oriented movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X