గురుపూజోత్సవం: బెస్ట్ టీచర్‌తో రామ్ చరణ్ (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: గురుపూజోత్సవం(టీచర్స్ డే) సందర్భంగా రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ నెట్వర్కింగులో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోను రామ్ చరణ్ భార్య ఉపాసన షేర్ చేసింది. తన బెస్ట్ టీచర్‌తో కలిసి రామ్ చరణ్ దిగిన ఫోటో ఇది. చిన్న తనంలో రామ్ చరణ్ చదువుల్లో పెద్దగా చురుకుగా ఉండే వాడు కాదట. అయితే స్పోర్ట్స్ విషయంలో మాత్రం చురుకుగా ఉండేవాడని సమాచారం.

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో నటిస్తున్నాడు. కాజల్‌ హీరోయిన్. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సెప్టెంబర్ 15న పాటలు విడుదల చేసి అక్టోబరు 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. యువన్‌శంకర్‌ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా రీరికార్డింగ్‌ పనులు ఇటీవలే మొదలయ్యాయి.

Cherry with his Teacher!

నిర్మాత గణేశ్‌ మాట్లాడుతూ...కృష్ణవంశీ అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువన్‌శంకర్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్సవుతుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. రామ్‌చరణ్‌ లుక్స్‌ అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. సెప్టెంబర్‌ 15న పాటలనూ, అక్టోబర్‌ 1న చిత్రాన్నీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ... ''కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రతీ సన్నివేశంలోనూ తెలుగుదనం ఉట్టిపడుతుంది. రామ్‌చరణ్‌ విదేశాల్లో పుట్టి పెరిగిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు. తనవారికోసం సొంతూరికి వచ్చిన ఓ ఎన్నారై యువకుడు ఎలాంటి సందడిని సృష్టించాడన్నది ఇందులో ఆసక్తికరం. చరణ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుందని' తెలిపారు. శ్రీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, కమలినీ ముఖర్జీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: నవీన్‌ నూలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X