twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినిమా ప్రీమియర్ షోకి చేతన్ భగత్

    By Srikanya
    |

    సెన్సేషనల్ పిక్షన్ రైటర్ చేతన్ భగత్ త్వరలో ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రం ప్రీమియర్ షోకి హాజరుకానున్నారు.నవంబర్ 9వ తేదీ తొమ్మిది గంటలకు ఆయన హైదరాబాద్ లో ఈ చిత్రం చూడనున్నారు.రీసెంట్ గా ఆయన రాసిన రెవుల్యూషన్ 2020 పుస్తకం మూడు వారాల్లో ఆరు లక్షలు కాపీలు అమ్ముడయ్యాయి.ఇక ఇట్స్ మై లవ్ స్టోరీ పోస్టర్స్ లో చేతన్ భగత్ పుస్తకం చదువుతున్న అమ్మాయి,అబ్బాయి ఉంటారు.నిజానికి చేతన్ భగత్ కీ ఈ చిత్రానికి ఆయనకు ఎటువంటి సంబంధం లేకపోయినా, 'ఇట్స్ మై లవ్ స్టోరీ' పోస్టర్ చేతన్ దృష్టిని ఆకర్షించింది.

    ఈ సినిమా పోస్టర్ లో హీరోహీరోయిన్ లు తాను రచించిన '3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్' పుస్తకాన్ని చదువుతూ కనిపించడం చేతన్ ను ఈ చిత్రంపై ఆసక్తి రేపింది.వెంటనే ఆయన తన ట్విట్టర్ పేజీలో ఈ విషయంపై ట్వీట్ చేస్తూ..'ఒక తెలుగు సినిమా పోస్టర్ లో కనిపిస్తున్న ఈ పెద్ద పుస్తకం ఏమిటి?' అని ట్విట్ చేశారు. ఇది తెలుసుకొని దర్శకుడు మధుర శ్రీధర్ ఆనందంతో వెంటనే తన చిత్రం ప్రీమియర్ షోకి హాజరు అవమన్నారు.తన అభిమాన రచయిత దృష్టిలో తన సినిమా పోస్టర్ పడటం, ఆయన దీని గురించి ప్రస్తావించడంతో మధురా శ్రీధర్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.

    అరవింద్ కృష్ణ, నికితా నారాయణ్ లు ప్రధాన జంటగా నటిస్తున్న 'ఇట్స్ మై లవ్ స్టోరీ' ఓ అచ్చమైన తెలుగు ప్రేమకథ. వరంగల్ కు చెందిన ఓ కంప్యూటర్ గేమ్ డిజైనర్ అయిన యువకుడు, ఫ్యాషన్ డిజైనర్ అయిన వైజాగ్ అమ్మాయితో ప్రేమపడటం, వారి మధ్య జరిగిన సంఘటనలే ఈ చిత్ర కథ. ఎంవీకే రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రం విషయానికి వస్తే..ఆ చిత్రం అందరూ కొత్త వాళ్ళతో మధురా శ్రీధర్ రూపొందించారు.

    English summary
    Sensational fiction writer Chetan Bhagat keen interested in Madhura Sridhar’s latest film ‘It’s My Love Story’. He is going to attended the premiere of IMLS which will happen at 9 pm on 9th November.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X