twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా ఎఫెక్ట్! స్పెషల్ పించన్‌.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

    |

    సినిమా అనేది సమాజాన్ని, సమాజంలోని జనాన్ని, ప్రభుత్వాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ ఒక్క ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏకంగా ఓ సినిమా చూసి దేశంలోని ఓ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా ఎఫెక్ట్ ఇటు జనంపై అటు ప్రభుత్వంపై పడింది. ఇంతకీ అసలు సంగతి ఏంటి? వివరాల్లోకి పోతే..

    దీపిక పడుకొనే లీడ్ రోల్ చపాక్

    దీపిక పడుకొనే లీడ్ రోల్ చపాక్

    యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా రూపొందిన తాజా చిత్రం ‘ఛపాక్'. బాలీవుడ్ భామ దీపిక పడుకొనే ముఖ్యపాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలు, యాసిడ్ దాడి బాధితుల సమస్యలు, వాటి వల్ల జరిగే పరిణామాలు ఈ సినిమాలో చూపించారు.

    దుర్ఘటనల ఎఫెక్ట్.. ప్రభుత్వాల ప్రోత్సాహం

    దుర్ఘటనల ఎఫెక్ట్.. ప్రభుత్వాల ప్రోత్సాహం

    నిజ జీవితంలోని దుర్ఘటనల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అద్దంపట్టే విధంగా తెరకెక్కిన ఈ సినిమాకు విడుదలకు ముందే కొన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇచ్చాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ‘చపాక్' చిత్రానికి అండగా నిలుస్తూ పన్ను రాయితీ ఇచ్చాయి. ఇక విడుదలయ్యాక ఈ సినిమా సూపర్ జోష్ కొనసాగిస్తోంది.

    రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

    రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

    అయితే ఛపాక్ సినిమా విడుదల తర్వాత ఆ ప్రభావంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. యాసిడ్‌ బాధితులకు త్వరలోనే ఫించన్‌ను అందించాలనుకుంటున్నామని ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి రేఖా ఆర్యా తెలపడం విశేషం.

    Recommended Video

    'Chhapaak' Will Have Impact In Society Says Laxmi Agarwal
     యాసిడ్‌ దాడి బాధితులకు స్పెషల్ ఫించన్‌

    యాసిడ్‌ దాడి బాధితులకు స్పెషల్ ఫించన్‌

    సమాజంలో గౌరవంగా జీవించేందుకు గాను యాసిడ్‌ దాడి బాధితులకు ప్రతీ ఏడాది 5000 నుంచి 6000 రూపాయల నగదును ఫించన్‌గా అందించే విధంగా కొత్త పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి రేఖా ఆర్యా వెల్లడించారు. కేబినెట్‌లో ఈ పథకం ఆమోదం పొందిన వెంటనే దీనిని అమలులోకి తెస్తామని తెలిపారు. యాసిడ్ దాడికి గురైన మహిళల కళలు సాకారం అయ్యేలా ఈ పథకం రూపుదిద్దుతామని మంత్రి రేఖా ఆర్య తెలిపారు.

    English summary
    Deepika Padukone's Chhapaak movie is tax free on Chhattisgarh and Madya Pradesh states. Now Uttarakhand Government decision on Chhapaak movie to give pension for Asid victims.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X