హీరోయిన్ డాన్స్ కోసం కోట్లు కుమ్మరించిన ప్రభుత్వం
చత్తీస్ గడ్: బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్ కోసం చత్తీస్ గడ్ ప్రభుత్వం భారీగా ఖర్చ చేసి వార్లల్లో నిలిచింది. ఇటీవల 'చత్తీస్‌గడ్' రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్కడి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కళాకారులతో, సినీ తారలతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా స్టెప్పులేసింది. ఇందుకుగాను కరీనాకు 'చత్తీస్ గడ్' రాష్ట ప్రభుత్వం రూ 1.40 కోట్ల పారితోషికం ఇచ్చింది. అదే ఈ కార్యక్రమంలో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇతర సినీ కళకారులకు కూడా భారీ మొత్తంలోనే పారితోషికాలు ఇచ్చారు.
సింగర్ సోను సిగమ్‌కు రూ. 36 లక్షలు, సునిధి చౌహాన్ కు రూ. 32 లక్షలు, హీరోయిన్ దియా మీర్జాకు రూ. 25 లక్షలు, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ హిమేష్ రేష్మియాకు రూ. 24 లక్షలు, పంకజ్ ఉదాస్ కు రూ. 90,000 ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వారిని ఇన్వైట్ చేయడానికి, వారిని ట్రావెలింగ్ ఎక్సండేచర్ కోసం రూ. 54.6 లక్షలు ఖర్చు చేసారు. అదే విధంగా వారికి ఉండటానికి హోటల్ గది సౌకర్యం, ఫుడ్ కోసం రూ. 11.67 లక్షలు ఖర్చు చేసారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు మొత్తం 245 మంది ఆర్టిస్టులను రప్పించారు. వీరిలో 42 మంది ఆర్టిస్టులు బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఆర్టిస్టుల కోసం మొత్తం దాదాపు రూ. 5.22 కోట్లు ఖర్చు పెట్టామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


Click it and Unblock the Notifications












