వెండితెరపై 'చోటా భీమ్' సీక్వెల్...రిలీజ్ డేట్

వారికొచ్చిన లాభాలను దృష్టిలో పెట్టుుకని... 'చోటా భీమ్' నిర్మాతలు బాలలను అలరించేందుకు ప్రతి వేసవికి ఒక చిత్రాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. 'చోటా భీమ్ అండ్ ద కర్స్ ఆఫ్ దమ్యాన్' చిత్రానికి సీక్వెల్‌గా 'చోటా భీమ్ అండ్ ద థ్రోన్ ఆఫ్ బాలి' అనే చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. యష్ రాజ్ ఫిల్మ్ వారు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఐదు వందల నుంచి ఆరు వందల తెరలపై మే ఐదవ తేదీన తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సదరు చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు 100 నిముషాల నిడివి గల చిత్రానికి దర్శకత్వం వహించిన రాజీవ్ చిలక తెలిపారు. ''ఇది ఒక సీక్వెల్ చిత్రం. అలాగని 'హ్యారీ పోటర్' తరహాలో మా హీరో పాత్రను పెంచి పోషించటంలేదు. హీరో పాత్రలో ఎలాంటి మార్పు లేదు. ప్రతి వేసవికి ఒక చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో మేం ఉన్నాం'' అని రాజీవ్ వివరించారు.
ఈ చిత్రంలో ఊహాల్లో మాత్రమే కనిపించే ఢోలక్‌పూర్ అనే గ్రామంలో తొమ్మిది సంవత్సరాల బాలుడు 'చోటా భీమ్', అతని మిత్రులు చేసే సాహస కార్యాలను ప్రదర్శిస్తుంది. ఈ సీక్వెల్ కూడా పిల్లలకు బాగా నచ్చుతుందని, పెద్దలను సైతం అలరింప చేస్తుంందని నిర్మాతలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











