»   » టాలీవుడ్ సెక్స్ రాకెట్: చికాగో పోలీస్ రిపోర్టులో సంచలన విషయాలు..

టాలీవుడ్ సెక్స్ రాకెట్: చికాగో పోలీస్ రిపోర్టులో సంచలన విషయాలు..

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  వీసా నిబంధనల ఉల్లంఘన కేసులో కిషన్ మోదుగుమూడి దపంతుల ఇంట్లో సోదాలు నిర్వహించినపుడు వారికి దొరికిన ఒక చిన్న నోట్ బుక్.... వారు నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ వ్యవహారం బట్టబయలు అయ్యేలా చేసిన సంగతి తెలిసిందే. సోదాల్లో వ్యభిచార నిర్వహణకు సంబంధించి అనేక ఆధారాలు దొరికాయి. దాదాపు 70 కండోమ్స్‌తో పాటు కిషన్ భార్య చంద్రకళ రాసుకున్న డైరీ ఈ వ్యవహారంలో ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి. చికాగో పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్లో హీరోయిన్ల పేర్లు పేర్కొనకుండా ఎ,బి,సి,డి అని పేర్కొన్నారు. ఈ సెక్స్ రాకెట్ ఎలా దొరికిపోయింది అనేది చికాగో పోలీసులు అందులో పేర్కొన్నారు.

  సెక్స్ రాకెట్ ఊబిలో చిక్కుకుపోయినవారిలో స్టార్ హీరోయిన్స్
  ‘ఎ' అనే హీరోయిన్ వ్యవహారంతో అనుమానం

  ‘ఎ' అనే హీరోయిన్ వ్యవహారంతో అనుమానం

  అమెరికాలో సెక్స్ రాకెట్ మీద అధికారులు దాఖలు చేసిన చార్జ్ షీట్లో మొదట ‘ఎ' అనే హీరోయిన్ ద్వారా సేకరించిన వివరాలతో ప్రారంభించారు. 2017 నవంబర్ 20న ఢిలీ నుండి ఓహరే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆమె దిగారు. ఆమె ఇమ్మిగ్రేషన్ అధికారులు బి1బి2 విసా చూపించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా(టాస్క్) నవంబర్ 18న ఓ కార్యక్రమం నిర్వహిస్తోందని ఆమె విజిటర్ వీసాలో పేర్కొన్నారు. కాలిఫోర్నియాలో జరిగే స్టార్ నైట్లో పాల్గొనేందుకు సినీ తారకు 10 రోజుల అనుమతి ఇవ్వాలని టాస్క్ ఇచ్చిన లేఖలో ఉంది. అయితే లేఖలో 18 తేదీ అని ఉంటే ఆమె 20న అమెరికాలో దిగారు. దీనిపై అధికారులు ఆమెను ప్రశ్నించారు. అయితే తాను జనవరి 25న జరిగే నాట్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చానని మరో లేఖ చూపించారు. అనుమానం వచ్చిన అధికారులు టాస్క్, నాట్స్ ప్రతినిధులను సంప్రదించగా ఆ హీరోయిన్ ఎవరో తమకు తెలియదని వారి నుండి సమాధానం వచ్చింది.

  తీగ లాగితే సెక్స్ రాకెట్ డొంక కదిలింది

  తీగ లాగితే సెక్స్ రాకెట్ డొంక కదిలింది

  అసలు ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు లేవని తేలింది. ఆమె చెబుతున్న వివరాలు, లేఖలు పొంత లేకుండా ఉండటంతో అధికారులు గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆమె శ్రీరాజ్ అనే వ్యక్తి ఈమెయిల్ ద్వారా ఆ లేఖలు పంపారని తెలిపారు. ప్లైట్, హోటల్ బుకింగ్ వివరాలను కూడా పంపినట్లు తెలిపారు. అతడి గురించి తనకు పెద్దగా తెలియదని, అతడు అమెరికాలో ఒక సంస్థ కోసం పని చేస్తున్నాడని తెలిపారు. అతడి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా తీగ లాగడంతో సెక్స్ రాకెట్ డొంక కదిలింది.

  డైరీలో అన్ని వివరాలు

  డైరీలో అన్ని వివరాలు

  చంద్రకకళ తన డైరీల్లో హీరోయిన్లతో వ్యభిచారానికి సంబంధించిన వివరాలు, కస్టమర్ల నుండి వసూలు చేసిన డబ్బుల వివరాలు ఉన్నట్లు అధికారులు చార్జ్ షీట్లలో పేర్కొన్నారు. చంద్రకళ రాసుకున్న 2018 డైరీలో హీరోయిన్ల సెక్స్ రాకెట్ కు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇందులో ‘బి' అనే బాధిత నటి గురించి రాసి ఉంది. 2017 డిసెంబర్ 29 నుండి 2018 జనవరి 7 వరకు ఈ వివరాలు ఉన్నాయి. ఆమె పేరు పక్కన బాణం గుర్తులు వేసి ఒకసారి, రెండు సార్లు అని రాసి ఉంది. డైరీలో ఎవరెవరు? ఎప్పుడు వచ్చారు? వారిని ఏ హోటల్ లో ఏ రూములో ఉంచాము? ఎవరి వద్ద ఎంత వసూలు చేసుకున్నాం అనే వివరాలు వివరంగా రాసుకున్నారు.

   ఒక్కసారి వెయ్యి, రెండు సార్లు మూడు వేలు

  ఒక్కసారి వెయ్యి, రెండు సార్లు మూడు వేలు

  ‘డి' అనే బాధిత నటి గురించి రాసి పక్కనే గారు అని మర్యాద పూర్వకంగా రాసినట్లు చార్జ్ షీట్లో పేర్కొన్నారు అధికారులు. ఒకసారి 1000 డాలర్లు, రెండు సార్లు 3వేల డాలర్లు అని చాలా చోట్ల రాసి ఉంది. ఇదంతా పేమెంటుకు సంబంధించిన వ్యవహారంగా అధికారులు అనుమానిస్తున్నారు. బాధిత హీరోయిన్లకు చెల్లించిన డబ్బుల వివరాలు రాసి కింద సంతకం చేశారు. 2016 డైరీలో ఇతర హీరోయిన్ల వివరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

  వారు ల్యాండ్ అవ్వగానే సందేశాలు

  వారు ల్యాండ్ అవ్వగానే సందేశాలు

  హీరోయిన్లు చికాగోలో దిగగానే చంద్రకళ కస్టమర్లకు వాట్సాప్ ద్వారా సందేశాలు, వారి ఫోటలు కూడా పంపేవారు. వారు ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటారు, ఏ హోటల్‌లో ఉంటారు అని అందులో పేర్కొనేవారు. కష్టమర్లతో బేరసారాలు ఆడి రేటు ఫిక్స్ చేసి వారి వద్దకు పంపేవారు.

  త్వరలో మరిన్ని పెద్ద తలకాయల పేర్లు

  త్వరలో మరిన్ని పెద్ద తలకాయల పేర్లు

  కిషన్ మోదుగుమూడి దంపతుల అరెస్టు తర్వాత వారి నుండి ఫోన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో ఉన్న వాట్సాప్ చాటింగ్ సహాయంలో కొత్త విషయాలు కనుక్కున్నారు. హీరోయిన్లను ఎవరెవరి వద్దకు పించారు, వారి వద్ద ఎంత వసూలు చేశారు అనేది అందులో ఉంది. ఈ వ్యవహారంలో విటుల వివరాలు సేకరించి వారిని ప్రశ్నిస్తున్నారు. త్వరలో మరిన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు రానున్నాయి.

  English summary
  American authorities have uncovered a prostitution and trafficking racket in Chicago, Illinois, involving young actresses from the Telugu and Kannada film industries. According to a Police report, five actresses fell victim as they were told they would be brought to the U.S. to perform at various events but were instead forced into prostitution by a small-time Tollywood production manager couple Kishan Modugumudi, also known as Sreeraj Chennupati and Chandrakala Purnima Modugumudi, also known as Vebha Jayam.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more