'కోతిమూక' తో ముఖ్యమంత్రి రోశయ్య
కృష్ణుడు, శ్రద్ధా ఆర్య జంటగా ఏవీయస్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కోతిమూక'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారితో పాటు పలువురు చిత్రరంగ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఆడియో సీడీని రోశయ్య ఆవిష్కరించి పాత్రికేయులు ఐ.వెంకట్రావుకి ఇచ్చారు. క్యాసెట్ ను మురళీ మోహన్ ఆవిష్కరించి ప్రముఖ పాత్రికేయులు రామచంద్రమూర్తికి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏవీయస్ మాట్లాడుతూ-"నా మీద నమ్మకం ఉంచి నిర్మాతలు రాజీపడకుండా ఈ చిత్రాన్ని తీశారు. ఇలాంటి నిర్మాతలు సక్సెస్ అవ్వడం చిత్రపరిశ్రమకు చాలా మంచిది. ప్రస్తుతం నిర్మాణ వ్యయం తగ్గించాలనే చర్చలు పరిశ్రమలో జరుగుతున్నాయి. మేం ఈ చిత్రాన్ని కేవలం 45రోజుల్లో తీశాం. ఈ చిత్రం పూర్తి వినోదం పంచుతుంది. అలాగే సందేశం కూడా ఉంది' అన్నారు. బ్రహ్మానందం, అలీ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులతో కలిసి ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని కృష్ణుడు తెలిపారు.


Click it and Unblock the Notifications











