»   » కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ డైరెక్టర్ ఇంటర్వ్యూ...

కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ డైరెక్టర్ ఇంటర్వ్యూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘దశావతారం', ‘విశ్వరూపం', ‘ఉత్తమవిలన్‌' వంటి అభిరుచి గల చిత్రాలను అందించిన విలక్షణ నటుడు, యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ హీరోగా రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘చీకటిరాజ్యం'. ప్రకాష్‌రాజ్‌, త్రిష, కిషోర్‌, సంపత్‌ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. నూతన దర్శకుడు రాజేష్‌ ఎమ్‌.సెల్వ దర్శకత్వంలో ఎన్‌.చంద్రహాసన్‌ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దర్శకుడు రాజేష్‌ ఎమ్‌.సెల్వ తో ఇంటర్వ్యూ...

మీ నేపథ్యం....?
- నేను తెలుగు కుర్రాడిని, మా అమ్మమ్మగారిది నెల్లూరు పక్కన చిన్న పల్లెటూరు. అయితే మా అమ్మగారు కాలం నుండి మేం చెన్నైలోనే సెటిల్‌ అయిపోయాం. అందువల్ల తెలుగు అర్థం అవుతుంది కానీ సరిగా మాట్లాడలేను.


సినిమా రంగంలో మీ జర్నీ ఎలా స్టార్టయింది?
-2008లో నేను రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌లో మూడవ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జాయినయ్యాను. అప్పటి నుండి ఈ జర్నీ ఆయనతో కొనసాగుతుంది. ఇప్పుడు అయన్ను డైరెక్ట్‌ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు నా శిక్షణ దశ పూర్తయిందనుకుంటా, కమల్‌గారు నేను డైరెక్ట్‌ చేయడానికి ఓకే అనుకున్నాడో ఏమో ఈ సినిమాకి నన్ను దర్శకుడిగా ఎంచుకున్నారు. ఆయన నుండి ఈ ఏడేళ్లలో ఏమీ నేర్చుకున్నాననే విషయం, నా పై ఆయన ఉంచిన నమ్మకాన్ని ప్రూవ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేసుకుంటాననే నమ్మకం ఉంది.


Chikati Rajyam director Rajesh M.Selava Interview

మీ గురువైన కమల్‌ను డైరెక్ట్‌ చేయడం ఎలా అనిపిస్తుంది?
- ఆ ఫీల్‌ను మాటల్లో చెప్పలేను. రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ పిలిం బ్యానర్‌ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా ఒక ప్యాషన్‌తో సినిమాలు తీయడం నాకు నచ్చింది. అందుకే ఆ బ్యానర్‌లోనే కొనసాగాను. ఈ సినిమాకి కూడా నేను డైరెక్టర్‌ అవుతానని అనుకోలేదు. కమల్‌హాసన్‌గారు నన్ను పిలిచి డైరెక్షన్‌ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తే నువ్వు డైరెక్ట్‌ చేయ్‌ అన్నారు. నేను చూసిన కమల్‌గారిని డైరెక్టర్‌గా చూశాను. ఇప్పుడు సడెన్‌గా అంతా డిఫరెంట్‌గా ఉంది. ఆయన ఈ సినిమాకి చేస్తున్న సపోర్ట్‌ గురించి మాటల్లో చెబితే తక్కువే అవుతుంది. డైరెక్టర్‌గా నేను ఆయన వద్ద వర్క్‌ చేశాను. ఇప్పుడు నన్ను ఆయన డైరెక్టర్‌ అని సంబోధిస్తుంటే, ఇతరులకు పరిచయం చేస్తున్నారు...ఇదంతా నాకు కలలాగా ఉంది.


కమల్‌హాసన్‌ను ఎలా ప్రజెంట్‌ చేస్తున్నారు..?
- ఈ సినిమాలో యాక్షన్‌, రొమాన్స్‌, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లంగ్‌ మూవెంట్స్‌ అన్నీ ఎలిమెంట్స్‌ కలిసి ఉన్నాయి. కమల్‌గారి ఫ్యాన్స్‌ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను రీచ్‌ అయ్యే సినిమా ఇది. ఈ జోనర్‌లో కమల్‌గారు సినిమా చేసి చాలా కాలమైంది.


ఏ లోకేషన్స్ లో షూటింగ్‌ చేస్తున్నారు..?
- హైదరాబాద్‌లో చాలా లోకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్నాం. టోలీచౌకీలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశాం, అలాగే రింగ్‌ రోడ్డులో ఛేజింగ్‌ సీక్వెన్స్‌ చేశాం. ప్రస్తుతం కత్రియాలో షూట్‌ చేస్తున్నాం. ఇక్కడు 70 శాతం పూర్తి చేసిన తర్వాత తమిళ వెర్షన్‌ను షూట్‌ చేయడానికి తమిళనాడుకు వెళతాం.


యాక్షన్‌ సీక్వెన్స్‌ ఎలా ఉండబోతున్నాయి..?
- ఈ సినిమా కోసం ఫ్రాన్స్‌ నుండి వచ్చిన జిల్స్‌, వర్జీనియా, సిల్వ స్పెషల్‌ యాక్షన్‌ టీమ్‌ ఉంది. వారి ఆధ్వర్యంలో ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తున్నాం. రమేష్‌ వారికి సపోర్ట్ గా ఉంటున్నాడు. కమల్‌గారు ఇటువంటి రోల్‌ చేసి చాలా రోజులైంది. ఇందులో సరికొత్త కమల్‌హాసన్‌ను చూస్తారు.


త్రిష క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
- త్రిష చాలా డిఫరెంట్‌ రోల్‌ చేస్తుంది. ఇటువంటి రోల్‌ ఆమె ఎప్పుడూ చేయలేదు.


శాను వర్గీస్‌తో పనిచేయడం ఎలా ఉంది?
- నేను గతంలో విశ్వరూపం సినిమాకి తనతో కలిసి పనిచేశాను. అయితే తను బిజీ సినిమాటోగ్రాఫర్‌గా మారిపోయాడు. ఉత్తమవిలన్‌ సినిమాకి కూడా మాకు అందుబాటులో లేడు. ఈ సినిమా విషయానికి వచ్చే సరికి తన కోసం కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సి వచ్చింది.


లోకేషన్‌లో కమల్‌ సపోర్ట్‌ ఎలా ఉంది?
- కమల్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన ఫుల్‌ సపోర్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఫుల్‌ భరోసా ఉంచారు. ఉదాహరణకి ఆయన స్పాట్‌కి రాగానే నేరుగా వెళ్లి కారా వ్యాన్‌లో కూర్చునేవారు. నాకు తెలిసి ఆయనలా ఎప్పుడూ చేయలేదు. మూడు రోజులు షూట్‌ తర్వాత ఆన్‌ లైన్‌ ఎడిట్‌ చేసుకుని రషెష్‌ను ఆయనకి చూపించాను. ఆయన చూసి కరెక్ట్‌ వే వెళుతున్నావు..గో అ హెడ్‌ అన్నారు. దాంతో నాకు కాన్ఫిడెన్స్‌ పెరిగింది. డైరెక్టర్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఆయన అమేజింగ్‌ నటుడు. ఆయన సపోర్ట్‌ మాటల్లో చెప్పలేనిది.


ఇందులో కమల్‌ మేకప్‌మేన్‌గా మారరని అంటున్నారు..?
- నిజం చెప్పాలంటే ఆ విషయంలో నాదే తప్పుంది. ప్రాస్తటిక్‌ మేకప్‌ కోసం ఆర్డర్‌ చేశాం. అయితే మిగతా పాత్రలకు ప్రాస్తటిక్‌ మేకప్‌ కొద్దిగా చేయాల్సి ఉంది. రేపు షూట్‌ ఉందనగా నాకు ఆ విషయం తెలిసింది. మా దగ్గర ఉన్న మేకప్‌ మేన్‌లు ప్రాస్తటిక్‌ మేకప్‌లో అంత ఎఫిషియెంట్‌ కాదు.. వెంటనే కమల్‌హాసన్‌గారి దగ్గరకెళ్లి ఆ విషయం చెప్పాను. ఆయన కూల్‌గా రేపు చూసుకుందాంలే అన్నారు. నిజంగానే సెట్‌కి వచ్చి ప్రకాష్‌రాజ్‌, త్రిషలకు ఆయనే స్వయంగా మేకప్‌ వేశారు. అది ఆయన గొప్పతనం.


సినిమా విడుదల ఎప్పుడు ఉంటుంది?
-సినిమా తెలుగు, తమిళంలో రూపొందుతోంది. ప్రస్తుతం తెలుగులో 70శాతం టాకీ పార్ట్ పూర్తయింది. అలాగే తమిళంలో కూడా చిత్రీకరణను పూర్తి చేసి ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం. అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైరెక్టర్‌ రాజేష్‌ ఎమ్‌.సెల్వ.

English summary
Kamal Haasan's Chikati Rajyam movie director Rajesh M.Selava Interview.
Please Wait while comments are loading...