చిలసౌ ట్విట్టర్ రివ్యూ: కొత్త దారిలో సుశాంత్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే!
Recommended Video

అక్కినేని ఫ్యామిలీ నేపథ్యంలో సినిమాల్లోకి వచ్చిన హీరో సుశాంత్ కు ఇంతవరకు చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. ప్రతి చిత్రంలోనూ తనని తాను మార్చుకోవడానికి సుశాంత్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రయోగాలని, మాస్ కథలని పక్కన పెట్టిన సుశాంత్ యూత్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ద్రుష్టి పెట్టాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే చిలసౌ చిత్రం వస్తోంది. అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్ర దర్శకుడిగా మారి చేస్తున్న తొలి చిత్రం ఇది. నేడు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానున్న నేపథ్యంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం.
పాజిటివ్ రిపోర్ట్స్
చిలసౌ చిత్రానికి యుఎస్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
సినిమా లవర్స్
ఈ వీకెండ్ సినిమా లవర్స్ కి పండగ. చిలసౌ, గూఢచారి చిత్రాలకు అద్భుతమైన స్పందన వస్తోంది.
నెమ్మదిగా
చిలసౌ చిత్రం నెమ్మదిగా సాగినా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి.
రాహుల్ దర్శకత్వం
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వానికి అద్భుతమైన స్పందన వస్తోంది. సుశాంత్ కెరీర్ లో చిలసౌ బిగ్ హిట్ గా నిలుస్తుంది.
సుశాంత్ కమ్ బ్యాక్ మూవీ
ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. సుశాంత్ కి చిలసౌ చిత్రం కమ్ బ్యాక్ మూవీ అవుతుంది.
వెన్నెల కిషోర్
ప్రస్తుతం వెన్నెల కిషోర్ మంచి జోరు మీద ఉన్నాడు. చిలసౌ చిత్రంలో అతడి పెర్ఫామెన్స్ చాలా బావుంది.
క్లీన్ మూవీ
ఇప్పుడే యూఎస్ లో చిలసౌ చిత్రం చూశా. క్లీన్ మూవీ. చాలా బావుంది.
మూడు నెలల తరువాత
మూడు నెలల తరువాత మంచి సినిమా చూశా. టైటిల్స్ పూర్తిగా అయ్యే వరకు కూడా థియేటర్ నుంచి ఎవరూ కదల్లేదు. చిలసౌ చిత్రం ఎలా ఉందొ దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











