సీనియర్ నటి భానుప్రియ నిజస్వరూపం బట్టబయలు.. 14ఏళ్ల బాలికతో, కేసు నమోదు!

సీనియర్ హీరోయిన్ భానుప్రియ సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో భానుప్రియ వందలాది చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. హోమ్లీ హీరోయిన్ పాత్రలలో ఆమె ఎక్కువగా నటించాడు. తాజాగా భానుప్రియ నిజస్వరూపాన్ని తెలియజేసే ఘటన ఆంధ్రప్రదేశ్ సామర్ల కోట వేదికగా బయట పడింది. ప్రభావతి అనే పేద మహిళ సామర్లకోట పోలీస్ స్టేషన్ లో భానుప్రియపై కేసు నమోదు చేసింది. కేసుకు సంబందించిన వివరాలు సంచలనం రేపే విధంగా ఉన్నాయి.

14ఏళ్ల బాలికని

14ఏళ్ల బాలికని

సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే నిరుపేద మహిళ ఏడాది క్రితం తన కుమార్తె సంధ్యని చెన్నైలో భానుప్రియ నివాసంలో పనికి పెట్టింది. ఆర్థిక పరిస్థితి బాగాలేక, చుట్టుపక్కల వాళ్ళ సలహాతోనే ఈ పని చేశానని ప్రభావతి తెలిపింది. తన కుమార్తెకు ప్రస్తుతం 14ఏళ్ల వయసు అని ఆమె వివరించింది. మొదట్లో తన కుమార్తెని తరచుగా ఇంటికి పంపుతూ, ఫోన్ లో మాట్లాడిస్తూ బాగానే ఉండేవారు. కానీ ఇప్పుడు తన కుమార్తెని వేధిస్తున్నారు అంటూ ప్రభావతి వాపోయింది.

చైల్డ్ హెల్ప్‌లైన్ సహకారంతో

చైల్డ్ హెల్ప్‌లైన్ సహకారంతో

చైల్డ్ హెల్ప్ లైన్ వారికి ఈ విషయం తెలియడంతో రంగంలోకి దిగారు. వారి సాయంతో ప్రభావతి సామర్లకోట పోలీస్ స్టేషన్ లో భానుప్రియపై కేసు నమోదు చేసింది. ఏడాది కాలంగా భానుప్రియ తన కుమార్తెని ఇంటికి పంపడం లేదని, వెట్టిచాకిరి చేయిస్తూ చిత్ర హింసలకు గురిచేస్తోందని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది.

భానుప్రియ సోదరుడు నీఛంగా

భానుప్రియ సోదరుడు నీఛంగా

భానుప్రియ సోదరుడు తన కుమర్తె పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నాడని సంచలన విషయాన్ని బయట పెట్టింది. అతడు తరచుగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. తన కుమార్తెని ఇంటికి పంపండి అని ప్రాధేయపడినా అంగీకరించడం లేదు. పైగా చోరీ కేసులు పెడతాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని భాదితురాలి తల్లి పేర్కొంది.

దర్యాప్తు పార్రంభం

దర్యాప్తు పార్రంభం

ప్రభావతి ఫిర్యాదు చేయగానే సామర్లకోట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నై చైల్డ్ హెల్ప్ లైన్ కు కూడా సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలోనే భానుప్రియ కుటుంబ సభ్యులని విచారణ కోసం రావాలని పోలీసులు ఆదేశించబోతునట్లు తెలుస్తోంది. చైల్డ్ లేబర్ అనేది చాలా తీవ్రమైన నేరం. సమాజంలో సెలేబ్రిటిగా చలామణి అయ్యే భానుప్రియ ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన గురించి భానుప్రియ ఇంకా స్పందించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X