twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోడ్డు ప్రమాదంలో బాల నటుడు మృతి.. విషాదంలో ఇండస్ట్రీ

    |

    రెండు రోజుల క్రితం కర్నాటకలో రోడ్డు ప్రమాదం జరిగి ఓ టీవీ నటి మరణించిన ఘటన మరువక ముందే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ బాల నటుడు మృతి చెందాడు. దీంతో ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగిపోయింది.

    రాయ్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శివలేఖ్ సింగ్ అనే బాల నటుడు దుర్మరణం చెందాడు. బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వైపు వెళుతుండగా శివలేఖ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివలేఖ్ అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, అతని తల్లి లేఖ్నా సింగ్‌, తండ్రి శివేంద్రసింగ్‌ తోపాటు మరో వ్యక్తి కూడా గాయాలపాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తలించారు.

    child actor Shivlekh Singh Died In Road Accident

    చిన్న వయసులోనే అత్యుత్తమ ప్రతిభతో టీవీ రంగంలోకి ప్రవేశించాడు శివలేఖ్ సింగ్ అనే బాలుడు. పద్నాలుగేళ్ల వయసున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ 'ససురాల్‌ సియర్‌ కా', 'సంకట్‌ మోచన్‌ హనుమాన్‌' అనే టీవీ సిరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, ఈ బుడ్డోడు పలు రియాలిటీ షోలతో పాటు కొన్ని సినిమాల్లో మెరిశాడు. ఈ మధ్యే మరికొన్ని సినిమాలకు సంతకాలు చేసినట్లు వాళ్ల బంధువులు చెబుతున్నారు.

    వాస్తవానికి శివలేఖ్ కుటుంబం చత్తీస్‌గడ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాకు చెందిన వారు. అయితే, అతడికి సీరియల్ అవకాశాలు రావడంతో పాటు షూటింగ్స్‌తో బిజీగా ఉండడంతో ముంబైకు మారిపోయారు. ఈ క్రమంలోనే స్వగ్రామానికి వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది ఈ కుటుంబం. శివలేఖ్ మృతితో బుల్లితెర పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గాయపడిన శివలేఖ్ తల్లి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారట. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

    ఇదిలాఉండగా, రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నడ టీవీ నటి శోభ, మరో నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. చిత్రదుర్గ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. 4వ నెంబర్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

    English summary
    Sankatmochan Hanuman Fame Child artist Shivlekh Singh (14), who had acted in many Hindi TV serials, was killed and his parents and another person were injured after their car collided with a truck on the outskirts of Raipur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X