రిషికేష్‌లో లభ్యమైన బాలనటుడు తేజ మృతదేహం

అక్కడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి రుషికేష్‌లోని సాయిఘాట్‌లో బాటుడి మృత దేహాన్ని గుర్తించారు. శవపరీక్ష అనంతరం రేపు తేజ మృతదేహాన్ని హైదరాబాద్‌కు కుటుంబసభ్యులు తీసుకురానున్నారు. మురారి, కథానాయకుడు, రామదండు తదితర చిత్రాల్లో తేజ బాల నటుడిగా నటించి నటించాడు.
తేజ తండ్రి ఎన్. శ్రీధర్ తెలుగు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. తేజ మరణంతో వారి కుటుంబం తీవ్ర దిగ్భాంతికి గురైంది. పలువురు తెలుగు సినీ ప్రముఖులు తేజ మరణం పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ఎంతో భవిష్యత్ ఉన్న తేజ మరణించడం అందరినీ కలిచి వేసింది.


Click it and Unblock the Notifications











