twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిషికేష్‌లో లభ్యమైన బాలనటుడు తేజ మృతదేహం

    By Bojja Kumar
    |

    Teja
    హైదరాబాద్: ఇటీవల గంగా నదిలో కొట్టుకుపోయి మరణించిన బాలనటుడు తేజ మృతదేహం లభ్యమైంది. రిషికేష్ లోని సాయిఘాట్ వద్ద అతని మృతదేహం లభించింది. తేజ పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లో ఉన్న మిరిపిరి అకాడమీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 5న కళాశాలకు చెందిన 25 మంది సభ్యుల బృందంలో రుషికేష్‌ వెళ్లిన తేజ గంగానదిలో దిగి గల్లంతయ్యాడు.

    అక్కడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి రుషికేష్‌లోని సాయిఘాట్‌లో బాటుడి మృత దేహాన్ని గుర్తించారు. శవపరీక్ష అనంతరం రేపు తేజ మృతదేహాన్ని హైదరాబాద్‌కు కుటుంబసభ్యులు తీసుకురానున్నారు. మురారి, కథానాయకుడు, రామదండు తదితర చిత్రాల్లో తేజ బాల నటుడిగా నటించి నటించాడు.

    తేజ తండ్రి ఎన్. శ్రీధర్ తెలుగు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. తేజ మరణంతో వారి కుటుంబం తీవ్ర దిగ్భాంతికి గురైంది. పలువురు తెలుగు సినీ ప్రముఖులు తేజ మరణం పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ఎంతో భవిష్యత్ ఉన్న తేజ మరణించడం అందరినీ కలిచి వేసింది.

    English summary
    Child actor Narla Teja’s body has been found today in Rishikesh at the Sai ghat. Teja is the son of cinematographer N Sridhar. He appeared in ‘Murari’ as a child actor. The body has been handed over to the authorities for post-mortem and is expected to reach Hyderabad tomorrow.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X