బాల నటుడు హఠాన్మరణం...పరిశ్రమ దిగ్బాంతి
గజ్వేల్ : 'జై బోలో తెలంగాణ' సినిమాలో గుడ్లు పీకి గోళీకాయలాడుకుంటా.. అంటూ విలన్‌ను తన డైలాగులతో అదరగొట్టి ప్రేక్షకుల మదిలో చెరగనిముద్ర వేసుకున్న బాలనటుడు అమన్ (13) సోమవారం మృతిచెందాడు. మెదక్ జిల్లా గజ్వేల్‌కు చెందిన ఇతడు మూడు రోజులుగా విరేచనాలతో బాధపడుతుండగా తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు.
సోమవారం ఉదయం పరిస్థితి విషమించటంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లగా రక్తపోటు తగ్గిపోయినందున హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మెడిసిటీలో చేర్పించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడని కుటుంబీకులు తెలిపారు.

గజ్వేల్ పట్టణానికి చెందిన ఎండి గౌస్ తబసుం ల పెద్ద కుమారుడు అమన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. అమన్ శరీరాకృతి బొద్దుగా ఉండడంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన దర్శకుడు శంకర్ జై బోలో తెలంగాణ చిత్రంలో అమన్ కు తొలిసారి అవకాశం ఇచ్చాడు. అ చిత్రంలో అమన్ బాలనటుడిగా పలికిన డైలాగ్ గుడ్లు పికి గోలి కాయలాడుకుంటా అనే డైలాగ్ ప్రేక్షకుల మన్నలను పొందింది.
ఆ తర్వాత లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై ఊ కొడితే ఉలిక్కి పడతారా చిత్రంలో మంచు మనోజ్‌తో , దేనికైన రెడీ చిత్రంలో మంచు విష్ణువర్ధన్ తో అలాగే కాలేజ్ స్టోరీ, చిగురాకు చిత్రంలో నటించాడు. అల్లరి నరేష్ చిత్రం యాక్షన్ 3డి లో అమన్ నటిం చి అందరిని అలరించాడు.
అమన్ మరణవార్త పలువురు చిత్ర ప్రముఖులను కలచివేసింది. బాలనటుడుగా మంచి భవిష్యత్తువున్న అమన్ మరణం తనను ఎంతగానో కలిచివేసిందని ‘జై బోలో తెలంగాణ' చిత్ర దర్శకుడు ఎన్.శంకర్ అన్నారు. అమన్ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వన్ ఇండియా తెలుగు ఈ నటుడి మృతికి నివాళులు అర్పిస్తోంది.


Click it and Unblock the Notifications











