అమెరికాలో కరోనా విలయతాండవం.. దారుణమైన పరిస్థితిలో బాలనటుడు మృతి..
అమెరికాలో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్నది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా సినీ, టెలివిజన్ సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బాలనటి లోగన్ విలియమ్స్ కూడా తుదిశ్వాస విడిచారు. అధికారికంగా కరోనావైరస్ అని ప్రకటన రాకున్నా.. కుటుంబ సభ్యులు, స్నేహితులు కరోనా కారణంగానే మరణించారని ధృవీకరించారు. ప్రస్తుతం ఆమె మరణంతో స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆమె వయసు 16 సంవత్సరాలే కావడం గమనార్హం.

లోగన్ తల్లి మార్లైజ్ విలియమ్స్ మాట్లాడుతూ.. లోగన్ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాం. సోషల్ డిస్టెన్స్ సమయంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నాం. ఈ కారణంగా బాధలో మనవరాలిని కోల్పోయిన నా తల్లిదండ్రులను కూడా కౌగిలించుకోలేకపోతున్నాను అని అన్నారు.
లోగన్ విలియమ్స విషయానికి వస్తే.. ది ఫ్లాష్ అనే టెలివిజన్ సిరియల్ ద్వారా అత్యంత గుర్తింపు పొందారు. ది ఫ్లాష్ చిత్రంలో యంగద్ బ్యారీ అలెన్‌గా నటించారు. ప్రతిభావంతురాలైన లోగన్‌కు పలు అవార్డులు, రివార్డులు లభించాయి.
2015లో పలు అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ తొలి పరిచయం అవార్డుకు లోగన్ నామినేషన్ సాధించారు. ర్యాప్ మ్యూజిక్‌లో ప్రవేశం కూడా ఉంది. ఆమె మరణంతో తన స్నేహితులు కూడా విషాదంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











