twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైల్డ్ ఆర్టిస్ట్ మృతి.. అలా ఇంజక్షన్ ఇవ్వడం, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే అంటూ ఆందోళన!

    |

    ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోతుంది. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, కే విశ్వనాథ్ కన్నుమూయగా శనివారం లెజండరీ సింగర్ వాణీ జయరాం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

    ఫిబ్రవరి 4న ఉదయం వాణీ జయరాం మరణించగా.. పోస్ట్ రిపోర్ట్ మాత్రం పలు అనుమానాలు వ్యక్తమవ్వడానికి కారణం అయింది. ఆదివారం వాణీ జయరాం అంత్యక్రియలు నిర్వహించగా.. అంతలోపే సినీ ఇండస్ట్రీలో మరో మరణవార్త వినాల్సి వచ్చింది. ఇప్పటి వరకు సీనియర్ నటీనటులు, దర్శకులు, గాయకులు మరణించగా తాజాగా చైల్డ్ ఆర్టిస్ట్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

    ఒక్కొక్కరుగా లోకాన్ని విడిచి..

    ఒక్కొక్కరుగా లోకాన్ని విడిచి..

    సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరి మరణ వార్త వినేలోపులే మరొకరు కన్నుమూశారనే వార్తతో సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతుంది. వివిధ కళలలో ప్రతిభ కనబర్చిన నటీనటులు, దర్శకులు, గాయనీగాయకుల మరణంతో సినీ ప్రేక్షక లోకం శోక సంద్రంలో మునిగుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతున్నారు. దీంతో వారి కుటుంబాలే కాకుండా అభిమానులు సైతం కన్నీళ్లతో వీడ్కోలు పలుకుతున్నారు. ఆదివారం అంటే ఫిబ్రవరి 5న లెజండరీ గాయనీ వాణీ జయరాం అంత్యక్రియలు పూర్తవ్వగా తాజాగా చిత్రపరిశ్రమలోని మరొకరి మరణ వార్త కలచివేస్తుంది.

    వాంతులు, విరేచనాలతో..

    వాంతులు, విరేచనాలతో..

    తాజాగా కన్నడ పరిశ్రమకు చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ కన్ను మూసింది. ఇప్పుడిప్పుడే నటిగా నిలదొక్కుకుంటోన్న 15 ఏళ్ల చైల్డ్ ఆర్టిస్ట్ సించన అనుమానస్పద స్థితిలో మరణించింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల సంచిత పదో తరగతి చదువుతోంది. ఓ వైపు చదువుతూనే మరోవైపు దుస్తుల దుకాణంలో పనిచేస్తోంది.

    అలాగే పలు సినిమాల్లో జూనియర్ డ్యాన్సర్ గా, చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తూ అలరిస్తోంది. అయితే సంచితకు శుక్రవారం రోజున వాంతులు, విరేచనాలు మొదలు అయ్యాయి. దీంతో ఆమెను వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ వైద్యులు సంచితను ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్స అందించారు.

    పోలీసుల విచారణ..

    పోలీసుల విచారణ..

    అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించినప్పటికీ సించన కోలుకోలేదు. చికిత్స పొందుతూ శనివారం సించన చనిపోయింది. అయితే ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని సించన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సించనకు గొంతు వద్ద ఇంజక్షన్ ఇవ్వడంతో రక్తస్రావం ఎక్కువై మృతిచెందినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు.

    ఈ విషయంపై బాగలకుంట పోలీసులను ఆశ్రయించి.. ఆసుపత్రిపై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే సించన శనివారం మరణించగా.. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

    English summary
    Kannada Film Industry Child Artist Sinchana Dies At 15 In Bangalore Private Hospital. Sinchana Parents Protest Against Doctors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X