నదిలో మునిగిపోయి బాలనటుడు తేజ మృతి

తేజ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న మిరిపిరి అకాడమీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 5న కళాశాలకు చెందిన 25 మంది సభ్యుల బృందంతో రుషికేష్‌కు వెళ్లాడు. లక్ష్మణ్‌ఝూలా ప్రాంతంలో ఏడుగురు సహచరులతో కలిసి గంగానదిలో దిగిన తేజ కనిపించకుండా పోయాడు.
విద్యార్థుల వెంట వెళ్లిన కేర్‌టేకర్ నిర్లక్ష్యం కారణంగానే తేజ కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా తేజ నీటిలోకి దిగిన ప్రాంతంలో ప్రమాదకర ప్రాంతం (డేంజర్ జోన్) అంటూ హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నాయని చెబుతున్నారు. తేజ ఆచూకీ కోసం కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











