twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నదిలో మునిగిపోయి బాలనటుడు తేజ మృతి

    By Srikanya
    |

    Child Artist Teja drown in Ganga
    హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌లోని రుషికేష్‌ వద్ద గంగానదిలోకి వెళ్లిన నగరానికి చెందిన బాల నటుడు నార్ల తేజ గల్లంతయ్యాడు. మురారి, కథానాయకుడు, రామదండు తదితర చిత్రాల్లో తేజ నటించాడు. హైదరాబాద్‌ నగరంలోని బోరబండ ప్రాంతంలో నివసించే నార్ల శ్రీధర్‌, హేమలతల కుమారుడు.

    తేజ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న మిరిపిరి అకాడమీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 5న కళాశాలకు చెందిన 25 మంది సభ్యుల బృందంతో రుషికేష్‌కు వెళ్లాడు. లక్ష్మణ్‌ఝూలా ప్రాంతంలో ఏడుగురు సహచరులతో కలిసి గంగానదిలో దిగిన తేజ కనిపించకుండా పోయాడు.

    విద్యార్థుల వెంట వెళ్లిన కేర్‌టేకర్‌ నిర్లక్ష్యం కారణంగానే తేజ కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా తేజ నీటిలోకి దిగిన ప్రాంతంలో ప్రమాదకర ప్రాంతం (డేంజర్‌ జోన్‌) అంటూ హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నాయని చెబుతున్నారు. తేజ ఆచూకీ కోసం కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలిస్తున్నారు.

    English summary
    Child Artist from Hyderbad died after drowning in river Ganga on Saturday morning. The incident took place in Laxman Jhula.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X