ఆకాశం దద్దరిల్లేలా తొడకొట్టిన ఆ కుర్రాడు... సమంత ‘ఓ బేబీ’ సినిమాలో!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇంద్ర' చిత్రంలో ఓ సన్నివేశంలో చిన్న పిల్లాడు ఆకాశం దద్దరిల్లేలా తొడకొడతాడు. అతడే పెద్దయ్యాక ఇంద్రసేనా రెడ్డి అవుతాడు.... ఈ సీన్ దాదాపుగా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు తేజ. ఈ మూవీతో పాటు చాలా తెలుగు చిత్రాల్లో తేజ చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు.

2006లో వచ్చిన 'శ్రీరామదాసు' చిత్రంలో రామదాసు కొడుకు పాత్రలో చివరి సారిగా కనిపించిన ఈ కుర్రాడు మళ్లీ ఇన్నేళ్లకు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంత కాలం తన స్టడీస్ మీద ఫోకస్ పెట్టిన తేజ ఇపుడు పెరిగి పెద్దయ్యాడు. త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతోంది. అయితే అంతకంటే ముందే ఇదే సంస్థ నుంచి వస్తున్న 'ఓ బేబీ' చిత్రంలో తేజ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Child artiste Teja grown up, will be seen in Samantha’s upcoming from Oh Baby

సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఓ బేబీ'. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో సమంత మనవడి పాత్రలో తేజ కనిపించబోతున్నాడట. తాజాగా విడుదలైన పోస్టర్‌తో ఈ విషయం స్పష్టమైంది. సమంత కొడుకు పాత్రలో రావు రమేష్, బెస్ట్ ఫ్రెండ్ పాత్రను రాజేంద్రప్రసాద్ పోషిస్తున్నారు.

'ఓ బేబీ' చిత్రంలో సమంత డెబ్బై ఏళ్ల ముసలమ్మ పాత్రలో... 20 యువతి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రం ఉండబోతోందని టాక్. ఈ చిత్రం జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X