సినీపెద్దల ఇళ్లల్లో పట్టుబడ్డ బాల కార్మికులు
మా సినిమాల్లో వాళ్ళు ను రేపటి పౌరులు గా చూపిస్తాం .అంత మాత్రాన అది నిజమెలా అవుతుంది.అలా అయితే మా ఇంట్లో పాచి పని ఎవరు చేస్తారు మేం ఊది పడేసిన సిగెరెట్లును ఎవరు ఊడుస్తారు అని విసుక్కుంటున్నారు చాలా మంది సినిమా పెద్దలు .హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ, కమలాపురి కాలనీల్లో డిప్యుటీ లేబర్ కమీషనర్ ఆధ్వర్యంలో 250 మంది కార్మిక శాఖ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఐటి ఉద్యోగుల ఇళ్లపైనా ... అక్కడున్న కొంతమంది సినీ ప్రముఖుల ఇళ్లపై కూడా ఈ దాడులు జరిగాయి.అక్కడ సినిమా వారి ఇళ్ళల్లో పనిచేస్తున్న 20 మంది బాల కార్మికుల్ని గుర్తించారు.అయితే వారిని విడిచి పెట్టాలంటూ ఆ ప్రముఖులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.ఇది తప్పుకాదా అని ప్రశ్నించిన మీడియా ప్రతినిథులపై కూడా వారు చిందులు తొక్కుతూ దాడులకు యత్నించారు. ఈ లోగా బాల కార్మికుల్ని కార్మిక శాఖ ఆఫీసుకు తరలించి వారి వివరాలు తెలుసుకోవాలని అధికారులు భావించారు.ఆ సందర్భంలో ఆ ప్రముఖులు అడ్డం తిరిగారు.వారికి ఉపాథి కల్పించడం కోసమే తాము వారిని చేరదీశామని సినిమాటిక్ గా కధలు చెప్పటానికి వారు ప్రయత్నం చేసారు.మరో ప్రక్క పట్టుకున్న బాల కార్మికుల్ని వదిలి వేయాలని పై అధికారులకు పైనుంచి వత్తిళ్లు ప్రారంభమయ్యాయి.అయినప్పటికీ అక్రమంగా బాల కార్మికులతో పని చేయించుకుంటున్న యజమానులకు కార్మిక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశింది.దాంతో ఇదంతా గమనిస్తున్న చాలా మంది చెప్పేటందుకే సినీ నీతులు...ఆచరించటానికి కాదని గొణుక్కుంటూ వెళ్ళి పోయారు.


Click it and Unblock the Notifications











