'షారుక్ ఖాన్ పసి పిల్లల మనసు చెడగొడుతున్నాడు'
ముంబయి: బాలీవుడ్ అగ్ర నటుడు షారుక్ ఖాన్‌ను వాంఖేడే స్టేడియం వివాదం వెంటాడుతూనే ఉంది. కొన్ని నెలల క్రితం ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా ముంబయిలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ అనంతరం అక్కడి భద్రతా సిబ్బందిపై షారుక్ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై అప్పట్లో అతనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. భద్రతా సిబ్బందితో అలా దురుసుగా ప్రవర్తించిన దానిపై షారుక్ వివరణ కూడా ఇచ్చుకున్నారు.
తాజాగా ఆ వివాదం మరోసారి ఆయనను వెంటాడింది. షారుక్ దుర్భాషాలాడటంపై అమిత్ మారు అనే వ్యక్తి బాలల హక్కు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బహిరంగ ప్రదేశాలలో అందరిముందు షారుక్ తన తిట్లు, దుర్భాషలతో చిన్న పిల్లల మనసులు చెడగొడుతున్నారని ఆరోపించారు.
దేశ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా షారుక్‌ను అనుసరిస్తుంటారని అమిత్ మారు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. షారుక్ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందని ఏడు అంశాలను అమిత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదు చేసిన అమిత్ మారు, మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్ అధికారులకు 16న హాజరు కావాలంటూ బాలల హక్కుల కమిషన్ నోటీసులు పంపించింది.
shahrukh khan child rights commission mumbai bollywood షారుక్ ఖాన్ బాలల హక్కుల కమిషన్ ముంబయి బాలీవుడ్


Click it and Unblock the Notifications
