twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో వివాదంలో కరాటే కళ్యాణి.. అక్రమంగా చిన్నారి కొనుగోలు.. అధికారుల సోదాలు?

    |

    నటి కరాటే కల్యాణి మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. కొద్ది రోజుల క్రితం కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్ తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న క్రమంలో ఆ ఇద్దరి మీద పోలీసు కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత కళ్యాణి తమను బెదిరించారు అంటూ మరో ఇద్దరు తెర మీదకు వచ్చి ఇద్దరూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు.

    Recommended Video

    Karate Kalyani Vs Sreekanth Reddy Controversy పూర్తి వివరాలు | Telugu Filmibeat

    అయితే ఇప్పుడు తాజాగా కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఆమె అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందాయని అంటున్నారు. ఈ క్రమంలో ఆమె ఇంటికి వెళ్లిన శిశు సంక్షేమ అధికారులు బృందం.. పాప గురించి వివరాలు ఎంక్వైరీ చేస్తుంది.

    అయితే ఆమె ఒక బాబును ఇప్పటికే పెంచుతున్నారు. ఆ బాబు పొత్తిళ్ళలో బాబుగా ఉండగా తనకు దొరికాడని ఆమె గతంలో వెల్లడించారు. అయితే ఆ బాబు గురించి కాదని, ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గలాటా జరిగినప్పుడు ఆమెతో పాటు ఉన్న ప్[అప గురించి అని అంటున్నారు. అయితే ఆమె ఆ చిన్నారిని దత్తత తీసుకున్నారని అంటున్నారు. ఆమె పెను చట్టబద్దంగా దత్తత తీసుకుందా అనే విషయంపై ప్రధానంగా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ప్రశ్నలు గుప్పించారని అంటున్నారు.

    Child Welfare officials raids on actress karate kalyani house

    దానికి సంబంధించిన డాక్యుమెంట్లు వెరిఫై చేస్తున్నారని అంటున్నారు. ఇక మరో పక్క తనపై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేస్తే..ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి నిందితులకు సపోర్ట్ చేస్తున్నారంటూ కరాటే కల్యాణి ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులుపై ఫైరయ్యిన వ్యవహారం కూడా చర్చనీయాంశం అయింది.

    విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులతో గొడవపడడం కరెక్ట్ కాదని స్టేషన్‌ నుంచి ఆమెను బయటకు పంపించారని తెలుస్తోంది. ఇక ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కల్యాణి సీఐపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతనని ఆమె పేర్కొన్నారు. అయితే కరాటే కళ్యాణి చేసిన్న ఆరోపణలపై సీఐ సైదులు కూడా స్పందించారు.

    చట్ట ప్రకారం సినీనటి కరాటే కళ్యాణి, యూట్యూబ్‌ ఫ్రాంక్‌ స్టార్‌ శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదులను తీసుకుని.. కేసులు నమోదు చేశామని వెల్లడించారు. కరాటే కల్యాణి అనవసరంగా ఇష్యూ చేస్తుందని పేర్కొన్న ఆయన ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పుంటే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి ఈ వ్యవహారం ఎందాకా వెళుతుందో చూడాలి మరి.

    English summary
    Child Welfare officials raids on actress karate kalyani house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X