చరణ్ చేతుళ్ళో ముద్దుముద్దుగా ఉన్న చిన్నారి ఎవరు..?!

By Sindhu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లేటెస్ట్ ఫిలిం 'రచ్చ". ఈ చిత్రం ప్రస్తుతం చైనా దేశంలోని అంజి అనే పట్టణంలో షూటింగ్ జరుపుకుంటోంది. అంజి, షాంఘై నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. అది చైనా లోనే అతిపెద్ద అడవైన నేషనల్ బేంబూ ఫారెస్ట్ ఉన్న ప్రదేశం. చైనీస్ పాపులర్ ఫిల్మ్ 'క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్"ను కొన్నేళ్ల క్రితం అక్కడే చిత్రీకరించారు. అయితే ఒక తెలుగు సినిమాను అక్కడ షూట్ చేయటం ఇదే తొలిసారి. ప్రస్తుతం అక్కడ రచ్చ ఫైటింగ్ సన్నివేశాలు తీస్తున్నారు.

అయితే చరణ్ కి ఇక్కడ ఉన్నట్టే చైనాలోనూ ఫ్యాన్స ఉన్నారు. తనని చూడడానికి వచ్చిన ఆ దంపతుల ముద్దుల పాపను చూడగానే, రామ్ చరణ్ కి ఆ పాపాయిని ఎత్తుకోవాలనిపించింది. నవ్వుతూ చేయిచాచగానే ఆ పాప రామ్ చరణ్ మీదకు ఒక్క ఉదుటున ఉరికింది. వెంటనే ఆ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడాడు. ఇంతకీ చరణ్ చేతుల్లో వున్న ఆ పాపాయి ఎవరనేగా మీ డౌటు? చైనాలోని ఏన్జీ సిటీ సమీపంలోని వెదురు అడవుల్లో జరుగుతున్న 'రచ్చ' సినిమా షూటింగు చూడడానికి వచ్చిన ఓ చైనా దంపతుల ముద్దుల బిడ్డ తను. క్యూట్ గా వున్న ఆ చిన్నారిని చరణ్ ఇలా ఎత్తుకుని కాసేపు ముద్దాడాడు. 'ఆ చిన్నారి బుగ్గలు ఎంత చూడముచ్చటగా వున్నాయో' అంటూ చరణ్ కామెంట్ కూడా చేశాడు! ప్రస్తుతం ఈ చిత్రం యాక్షన్ దృశ్యాలను అక్కడ షూట్ చేస్తున్నారు.

సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్ వి ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మరో నటుడు అజ్మల్ (రంగం ఫేం) ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 'రచ్చ చిత్రాన్ని కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ మధ్యే 'వాన వాన వెల్లూవాయే" పాటకు రీమిక్స్ వెర్షన్ ను చరణ్ -తమన్నా లపై చిత్రీకరించారు. మణిశర్మ ఈ మూవీ కి సంగీతం సమకూరుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X