twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్మయి, సమంతలపై ఓ రేంజ్‌లో ట్రోల్స్.. లైంగిక వేధింపుల గురించి మాట్లాడే మీరు!

    |

    కొన్ని సందర్భాల్లో సెలబ్రెటీలకు ఎటు నుంచి ఏ చిక్కు వచ్చిపడుతుందో ఊహించలేం. వివాదాలకు కేంద్రబిందువు అవుతున్న కొన్ని అంశాల్లో ఏదో ఒక కారణం చూపుతూ సెలబ్రిటీలను లాగేస్తుంటారు నెటిజన్లు. తాజాగా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు టాలీవుడ్ ఫేమస్ స్టార్ సమంత, ఆమె ప్రియనేస్తం చిన్మయి. అటొచ్చి ఇటొచ్చి బిగ్ బాస్ వివాదం ఈ ఇద్దరికీ చుట్టుకుంది. అదెలా అంటారా? చూడండి మీకే తెలుస్తుంది.

    'బిగ్ బాస్'పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

    'బిగ్ బాస్'పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు


    బిగ్ బాస్ పేరిట మహిళలను మోసం చేస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. వెండితెర పైనే కాదు బుల్లితెర షో బిగ్ బాస్‌లో కూడా కాస్టింగ్ కౌచ్ రాజ్యమేలుతుందంటూ యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా పోరాటం చేస్తున్నారు. బిగ్ బాస్ యాజమాన్యం మాటలతో మోసపోయిన తమకు న్యాయం చేయాలని, వెంటనే బిగ్ బాస్ బ్యాన్ చేయాలని వారు డిమాండ్స్ చేస్తున్నారు.

    గతంలో కాస్టింగ్ కౌచ్ ఉదంతంపై చిన్మయి పోరాటం

    గతంలో కాస్టింగ్ కౌచ్ ఉదంతంపై చిన్మయి పోరాటం

    మహిళల పట్ల లైంగిక దాడికి పాల్పడుతున్నారంటూ గతంలో చిన్మయి చేసిన పోరాటం గురించి అందరికీ తెలిసిందే. తమిళ్ లిరికిస్ట్ వైరాముత్తు పై ఆరోపణలు గుప్పిస్తూ మహిళలకు అన్యాయం జరుగుతోందని ఫైర్ అయింది చిన్మయి. ఆమె చేసిన ఈ పోరాటానికి స్టార్ హీరోయిన్ సమంత కూడా అండగా నిలుస్తూ ట్వీట్స్ చేసింది.

    ఆధారాలు చూపమంటే..

    ఆధారాలు చూపమంటే..

    అప్పట్లో చిన్మయి చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించమంటే.. కొన్నింటికి ఆధారాలు చూపించలేమని, ఆడపిల్ల ధైర్యంగా ఇలాంటి విషయాలు చెప్పడమే ఆధారమని పేర్కొంది చిన్మయి. పైగా ఓ ఆడపిల్ల గోడు ముందు వినాలని, ఆ తర్వాత ఆ ఇష్యుపై ఎలా చర్యలు తీసుకోవాలో డిసైడ్ కావాలని లాజిక్ మాట్లాడింది చిన్మయి.

    చిన్మయి, సమంతలపై ప్రశ్నల వర్షం

    చిన్మయి, సమంతలపై ప్రశ్నల వర్షం

    అయితే.. ఆ రోజున ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులపై అంతగా మాట్లాడిన చిన్మయి, సమంతలు ఈ రోజున బిగ్ బాస్ ఇష్యు జరుగుతుంటే ఎక్కడ పోయినట్లు? అని సోషల్ మీడియాలో ప్రశ్నల పరంపర కొనసాగుతోంది. నాగార్జున హోస్ట్ కాబట్టి మీ నుంచి స్పందన రావడం లేదా? ఆడపిల్లల అన్యాయాల గురించి మాట్లాడే మీరు ఎందుకిలా సైలెంట్ గా ఉంటున్నారు? అంటూ ట్రోల్స్ పెరిగాయి.

    నాగార్జున ఇంటిముందు ఆందోళనలు

    నాగార్జున ఇంటిముందు ఆందోళనలు

    ఆడవాళ్లను కించపరిచే విధంగా ఉన్న 'బిగ్ బాస్' షోను వెంటనే రద్దు చేయాలని, నాగార్జున కూడా వెంటనే ఈ షో నుంచి తప్పుకోవాలని ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నాగార్జున ఇంటి ముందు ధర్నాకు దిగారు. పోలీసుల జోక్యంతో విద్యార్థులు వెనుదిరిగారు.

    ఇంతకీ నాగ్, చిన్మయి, సమంత రియాక్ట్ అవుతారా?

    ఇంతకీ నాగ్, చిన్మయి, సమంత రియాక్ట్ అవుతారా?

    బిగ్ బాస్ 3 పై వస్తున్న ఆరోపణలపై ఇప్పటిదాకా నాగార్జున నోరు విప్పలేదు. ఈ ఆరోపణలు ఆయనపై కాకపోయినప్పటికీ.. కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు కాబట్టి స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ లోగా బిగ్ బాస్ ఇష్యుపై సమంత, చిన్మయి లపై కూడా ట్రోల్స్ పెరగడం హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి నాగ్, చిన్మయి, సమంత రియాక్ట్ అవుతారా? లేదా? అనేది.

    English summary
    Bigg Boss - Season 3 will starts on july 21st. On this show some Controvesy is running. Anchor Swetha Reddy and Gayathri Gupta says sensetional issues on Bigg Boss - Season 3 management. On this issue the netijans are started trolling Chinmayi and Samantha Akkineni.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X