నా భర్త ఎప్పుడు కొట్టలేదు.. సందీప్ రెడ్డి వంగాపై చిన్మయి ఫైర్

Recommended Video

Singer Chinmayi Fires On Sandeep Reddy Vanga || Kabir Singh || Arjun Reddy || Filmibeat Telugu

డేరింగ్ డాషింగ్‌గా ఉండే చిన్మయి తాజాగా మరో వివాదంలో సంచలన కామెంట్స్ చేసింది. కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై ఫైర్ అవుతూ ట్వీట్స్ చేసింది. సందీప్ రెడ్డి మాట్లాడిన మాటలు మహిళల్ని అవమానించేలా ఉన్నాయంటూ ఘాటుగా స్పందించింది. వివరాల్లోకి పోతే..

 అర్జున్ రెడ్డి రీమేక్

అర్జున్ రెడ్డి రీమేక్

చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. అయితే తెలుగు అర్జున్ రెడ్డికి దర్శకత్వం వహించిన సందీప్ వంగానే హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో ఈ సినిమాను రీమేక్ చేసి సక్సెస్ సాధించాడు. రికార్డు లెవెల్‌లో కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది కబీర్ సింగ్.

అప్పట్లో ఇక్కడ.. ఇప్పడు అక్కడ

అప్పట్లో ఇక్కడ.. ఇప్పడు అక్కడ

అర్జున్ రెడ్డి సినిమాకు వివాదాలు చుట్టముట్టడం కామన్ అయింది. అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో ఈ సినిమాపై చెలరేగిన వివాదాలు సంచలనం సృష్టించాయి. బోల్డ్ సీన్స్, లిప్‌లాక్స్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాగోలా అది మరచిపోగా ఇక ఇప్పుడు కబీర్ సింగ్ విషయం లోనూ వివాదాలు చెలరేగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది.

డైరెక్టర్ వ్యాఖ్యలే మూల కారణం

డైరెక్టర్ వ్యాఖ్యలే మూల కారణం

కబీర్ సింగ్ సినిమా సక్సెస్ కావడంతో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న సందీప్ రెడ్డి వంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'ప్రేమలో ఉన్న ఇద్దరికి ఒకరినొకరు టచ్ చేసుకునే చనువు, అలాగే కొట్టుకునే స్వేచ్ఛ ఉండాలి. అదే లేనపుడు వారిలో నిజమైన ప్రేమ లేనట్లే' అని పేర్కొన్నాడు సందీప్. ఈ వ్యాఖ్యలే దుమారానికి దారి తీశాయి.

చిన్మయి ఫైర్..

సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళల్ని అవమానించేలా ఉన్నాయంటూ గాయని చిన్మయి ట్విటర్ ద్వారా పేర్కొంది. సందీప్ రెడ్డి మట్లాడిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన చిన్మయి.. ' ప్రేమలో ఉంటే ఒకరినొకరు కొట్టుకోవాలా.. నేను, నా భర్త ప్రేమలో ఉన్నాం.. నా భర్త నన్నెప్పుడూ కొట్టలేదు. ఒకరిని ఒకరు కొట్టుకుంటేనే ప్రేమని నిరూపించుకున్నట్లా?' అని ప్రశ్నించింది. ఇలాంటి సినిమాలు, కామెంట్స్ వల్ల మన పిల్లలు కూడా అలాగే తయారయ్యే ప్రమాదం ఉందని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది.

200 కోట్ల క్లబ్‌లో కబీర్ సింగ్

200 కోట్ల క్లబ్‌లో కబీర్ సింగ్

షాహిద్ కపూర్, కియారా అద్వానీ కెమెస్ట్రీ.. సందీప్ రెడ్డి వంగా టేకింగ్ సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. తొలి రోజే పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్న బీ టౌన్ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తూ ఇప్పటికీ 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయి 300 కోట్ల దిశగా దూసుకుపోతోంది 'కబీర్ సింగ్'.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X