మీ ఆయనకు పిల్లలు పుట్టడం లేదా?.. పచ్చి పచ్చిగా మాట్లాడిన నెటిజన్.. చిన్మయి ఫైర్

చిన్మయి శ్రీపాద అంటే ఒకప్పుడు అందమైన గొంతు, అద్భుతమైన పాటలు గుర్తొచ్చేవి. అయితే క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమం ఎప్పుడైతే ఊపందుకుందో.. చిన్మయి పూర్తిగా మారిపోయింది. ఓ స్త్రీ శక్తిగా మారింది. రెబల్‌గా మారిపోయి.. అన్యాయం జరిగిన ఆడవారికి గొంతుకైంది. కోలీవుడ్‌లో చిన్మయి సృష్టించిన ప్రకంపనలకు పెద్ద పెద్ద వారి పునాదులే కూలిపోయే పరిస్థితి వచ్చింది. అయితే నాటి నుంచి నేటి వరకు చిన్మయిపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా పెరిగాయి.

మీటూపై పోరు..

మీటూపై పోరు..

దక్షిణాదిలో మీటూపై జరిగిన పోరాటంలో చిన్మయి ముందుంది. వైరముత్తు లాంటి సినీ దిగ్గజంపైనే ఆరోపణలు చేసింది. తన చిన్న తనంలో కావాలనే అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన కామెంట్స్ చేసింది. అప్పటి నుంచి వైరముత్తు, చిన్మయి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ దెబ్బతో చిన్మయిని డబ్బింగ్ యూనియన్ నుంచి తీసేయడం, అవకాశాలు రాకుండా చేయడం వంటివి జరుగుతూనే వస్తున్నాయి.

 తోటి సింగర్ అయినా..

తోటి సింగర్ అయినా..

సింగర్ కార్తిక్ గురించి దక్షిణాదిన పరిచయం అక్కర్లేదు. అయితే అతనిపైనా మీటూ ఆరోపణలు వచ్చాయి. ఎందరో అమ్మాయిలను వాడుకున్నాడని చిన్మయి బయట పెట్టింది. అలా అప్పటి నుంచి మోసపోయిన అమ్మాయిలకు అండగా నిలబడుతూనే వస్తోంది. ఇక సోషల్ మీడియాలో చిన్మయి చేసే కామెంట్లు ఫెమినిజాన్ని చాటుతున్నాయని అందరూ టార్గెట్ చేస్తుంటారు.

 నెగెటివ్ కామెంట్స్..

నెగెటివ్ కామెంట్స్..

చిన్మయికి వచ్చినన్ని నెగెటివ్ కామెంట్స్ ఇంకెవ్వరికి రావు. ఈ విషయాన్ని ఆమె, తన భర్త రాహుల్ రవీంద్రన్ కూడా బహిరంగంగానే చెబుతాడు. పైగా చిన్మయికి వచ్చే కామెంట్లను కూడా చూస్తానని పేర్కొన్నాడు. నెటిజన్లు పరిధి దాటి విచ్చలవిడిగా చిన్మయిని దూషిస్తారు.

పిల్లలు పుట్టడం లేదా?

పిల్లలు పుట్టడం లేదా?

తాజాగా ఓ నెటిజన్ చిన్మయిని పచ్చిగా తిట్టాడు. మీ ఆయనుకు పిల్లలు పుట్టడం లేదా? అంటూ రెచ్చిపోయాడు. సదరు నెటిజన్ అన్న మాటలు కూడా రాయడానికి వణుకు పుట్టాల్సిందే. అలాంటి ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఇక సదరు నెటిజన్ అంతలా హద్దు మీరినా సరే చిన్మయి మాత్రం చాలా శాంతంగా సమాధానమిచ్చింది.

Recommended Video

Samantha Fans Demand Apologize From Pooja Hegde
స్వీట్ తెలుగు అబ్బాయిలు..

స్వీట్ తెలుగు అబ్బాయిలు..

స్వీట్ తెలుగు అబ్బాయిలు అంటూ చిన్మయి..‘మంచి సంస్కారం, మంచి పెంపకం, నాకు పంపించినట్టుగానే ఇలా ఎంతో మంది అమ్మాయిలకు పంపించే మగాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ ఏమి తెలియనట్టుగా అమాయకుడిలా ఫేస్ పెట్టుకుని, పెళ్లి చేసుకుని, కోట్లలో డబ్బులు దొబ్బి బతుకుతున్నారన్న మాట. అమ్మాయిలందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా. చాలా జాగ్రత్తగా ఉండండి. మన కర్మ జాగ్రత్తగా ఉండటం. ఇలాంటి పొగరుబోతులు ఇలాగే తిరుగుతున్నారు' అంటూ ఆవేదన చెందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X