సింగర్ చిన్మయ వివాహ తేదీ ఖరారు
హైదరాబాద్ : పాపులర్ గాయికురాలు,డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి వివాహ తేదీ నిశ్చయిమైంది. మే 6 వ తేదీన ఆమె రాహుల్ రవీంద్రన్ (అందాల రాక్షసి ఫేం) ని వివాహం చేసుకోవటానికి పెద్దలు నిర్ణయించారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వీరి వివాహానికి సినీ పరిశ్రమ నుంచీ భారీగానే హాజరవుతారని తెలుస్తోంది.
రాహుల్ మాట్లాడుతూ.... చిన్మయిలో నాకు నచ్చింది ప్రధానంగా తన మనస్తత్వం. తనది చాలా ఓపెన్ మైండ్. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో ఒకేలా మాట్లాడుతుంది. ఎవరి గురించైనా వెంటనే ఒక నిర్ణయానికి రాదు. చాలా నిజాయితీగా ఉంటుంది. ఏ విషయాన్నీ మనసులో దాచుకోకుండా నాతో డిస్కస్ చేస్తుంది. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. చాలా తెలివైన అమ్మాయి. ఫెంటాస్టిక్ గాళ్. అందుకే నచ్చింది. నేను ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిని భార్యగా కోరుకున్నానో, అవన్నీ తనలో పరిపూర్ణంగా ఉన్నాయి. తనే నా బెటర్‌హాఫ్ అన్నారు.

తమ వివాహం విషయమై చెప్తూ... ఈ విషయంలో మేం పెద్దగా కష్టపడలేదు. మా ఇంట్లోవాళ్లు వెంటనే ఓకే చెప్పేశారు. మాది తమిళ కుటుంబం. చిన్మయి మదర్ తమిళియనే కానీ, ఫాదర్ మాత్రం తెలుగు అన్నారు. 'ఏ మాయ చేసేవె' చిత్రంలో సమంత వాయిస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తొలి చిత్రంతో సమంతకు అంత పేరు రావడానికి ఆ వాయిస్ కూడా ప్రధాన కారణం. ఈ చిత్రంలో సమంతకు డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి.
ఇక అందాల రాక్షసి చిత్రం ద్వారా తెలుగు హీరోగా పరిచయం అయిన రాహుల్, ఆ తర్వాత పలు చిన్న బడ్జెట్ చిత్రాల్లో నటింస్తున్నాడు. ప్రస్తుతం పెళ్లి పుస్తకం, వనక్కం చెన్నై, నేనేం చిన్న పిల్లనా చిత్రాల్లో నటిస్తున్నాడు. తెలుగులో ప్రవేశించడానికి ముందు రాహుల్ మూడు తమిళ చిత్రాల్లో నటించాడు.


Click it and Unblock the Notifications











