గ్రాండ్‌గా సింగర్ చిన్మయి, హీరో రాహుల్ పెళ్లి (ఫోటోలు)
చెన్నై: ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి, హీరో రాహుల్ రవీంద్రన్ వివాహం ఈ రోజు(మే 5) ఉదయం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఆదివారం ఫార్మల్‌గా ఎంగేజ్మెంట్ వేడుకు జరుపుకున్న ఈ జంట...సోమవారం ఉదయం పెళ్లి ద్వారా ఏకమయ్యారు. పూర్తి హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది.
వీరి వివాహ వేడుకకు తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైభవంగా వివాహ మహోత్సవం జరిగింది. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దలను తమ పెళ్లికి ఒప్పించారు.
రాహుల్, చిన్మయి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

ఎంగేజ్మెంట్
రాహుల్, చిన్మయి ఎంగేజ్మెంట్ ఆదివారం ఫార్మల్‌గా జరిగింది. ఎంగేజ్మెంట్ సందర్భంగా దిగిన ఫోటో ఇది.

చిన్మయి, రాహుల్ వివాహం
చిన్మయి, రాహుల్ వివాహం సందర్బంగా తీసిన ఫోటో ఇది. ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉంది కదూ...

ప్రేమ వివాహం
రాహుల్, చిన్మయి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఒకే రంగానికి చెందిన వారు కావడంతో ఇద్దరి అభిప్రాయాలు కలిసాయి.

చిన్మయి గురించి రాహుల్
చిన్మయిలో నాకు నచ్చింది ప్రధానంగా తన మనస్తత్వం. తనది చాలా ఓపెన్ మైండ్. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో ఒకేలా మాట్లాడుతుంది. ఎవరి గురించైనా వెంటనే ఒక నిర్ణయానికి రాదు. చాలా నిజాయితీగా ఉంటుంది. ఏ విషయాన్నీ మనసులో దాచుకోకుండా నాతో డిస్కస్ చేస్తుంది. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. చాలా తెలివైన అమ్మాయి. ఫెంటాస్టిక్ గాళ్. అందుకే నచ్చింది.

రాహుల్ కోరుకున్న విధంగా
నేను ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిని భార్యగా కోరుకున్నానో, అవన్నీ తనలో పరిపూర్ణంగా ఉన్నాయి. తనే నా బెటర్‌హాఫ్ అన్నారు.

పెద్దలను ఒప్పించారు
ఈ విషయంలో మేం పెద్దగా కష్టపడలేదు. మా ఇంట్లోవాళ్లు వెంటనే ఓకే చెప్పేశారు. మాది తమిళ కుటుంబం. చిన్మయి మదర్ తమిళియనే కానీ, ఫాదర్ మాత్రం తెలుగు అని చెప్పారు రాహుల్.

చిన్మయి
‘ఏ మాయ చేసేవె' చిత్రంలో సమంత వాయిస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తొలి చిత్రంతో సమంతకు అంత పేరు రావడానికి ఆ వాయిస్ కూడా ప్రధాన కారణం. ఆ వాయిస్ చిన్మయిదే. సింగర్‌గా కూడా చిన్మయికి మంచి పేరుంది.

రాహుల్
ఇక అందాల రాక్షసి చిత్రం ద్వారా తెలుగు హీరోగా పరిచయ్యాడు రాహుల్. తెలుగులో ప్రవేశించడానికి ముందు రాహుల్ మూడు తమిళ చిత్రాల్లో నటించాడు.


Click it and Unblock the Notifications











