మోసగాడు మళ్లీ వచ్చాడు.. గెస్ట్‌హౌస్‌లో ఆడిషన్స్ పేరుతో.. నిర్మాతపై చిన్మయి ధ్వజం

సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చిన మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సినీ ప్రముఖుల్లో చిన్మయి శ్రీపాద ఒకరు. వివాదాస్పద శ్రీరెడ్డి ఆరోపణలతో ఊపందుకొన్న ఉద్యమాన్ని చిన్మయి మరింత ముందుకు తీసుకెళ్లింది. ప్రముఖ సినీ గేయ, మాటల రచయిత వైరముత్తుపై చిన్మయి చేసిన ఆరోపణలు దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రకంపనలు లేపాయి. అలాంటి గాయని చిన్మయి కొద్దికాలంగా తన గళాన్ని వినిపించడం తగ్గించారు. కానీ తాజాగా మళ్లీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంతకు ఈసారి ఎవరిని టార్గెట్ చేసిందంటే..

కైలాష్ ఖేర్ విషయంలో

కైలాష్ ఖేర్ విషయంలో

గాయని చిన్మయి ఇండస్ట్రీలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను మరోసారి ఏకరువు పెట్టారు. అందుకు కారణం రీతూపర్ణ చటర్జీ చేసిన ట్వీట్. ఆమె తన ట్వీట్‌లో గాయకుడు కైలాష్ ఖేర్‌పై 2018లో ముగ్గురు సినీ తారలు చేసిన ఆరోపణలు ప్రస్తావిస్తే.. దానికి ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. కానీ మహిళలకు న్యాయం జరుగలేదనే తాజాగా మరోసారి ట్వీట్‌లో ప్రస్తావించారు. లైంగిక ఆరోపణల వల్ల ఏమీ ఒరుగదనేది కైలాష్ విషయంలో స్పష్టమైందని పేర్కొన్నారు.

రాధారవి విషయంలో బీజేపీ

రీతూపర్ణ చటర్జీ ట్వీట్‌కు సమాధానం ఇస్తూ.. అప్పుడు, ఇప్పుడు రాజకీయ పార్టీలలో మార్పు ఏమీ లేదు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నటుడు రాధారవిని తమ పార్టీలో తమిళనాడు బీజేపీ చేర్చుకొన్నది. తాను ఆరోపణలు చేసిన వైరముత్తుకు తమిళ సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు అండగా నిలిచారు. లైంగిక వేధింపుల బాధితుల కంటే దాడులు చేసిన వ్యక్తులకే ఎక్కువ సపోర్టు ఉంది అని చిన్మయి శ్రీపాద ఓ ట్వీట్ చేశారు.

నాలాంటి బాధితులకు నిషేధమే న్యాయం

నాలాంటి బాధితులకు నిషేధమే న్యాయం

సినీ పరిశ్రమలో నాలాంటి బాధితులకు జరిగిన న్యాయం బ్యాన్. పనిచేయకుండా నాపై నిషేధం విధించారు. వేరే సంస్థలు నాకు పని ఇవ్వడానికి నిరాకరించారు. ఆమెకు సినీ పరిశ్రమ నుంచి ఎందుకు మద్దతు లభించలేదో మీరు ఊహించుకోండి. ఆమెలోనే తప్పు ఉంది అని ఓ ప్రముఖ సినీ గాయకుడు వ్యాఖ్యానించడం మరింత బాధ కలిగించింది అంటూ చిన్నయి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Recommended Video

Manmadhudu 2 Team Independence Day Special Interview || AKkineni Nagarjuna || Rakul Preet Singh

ఆ నిర్మాత మోసాలకు పాల్పడుతాడు..

ఇక ఇటీవల నిర్మాత దేవ్ రాహుల్ అనే వ్యక్తి గురించి చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. అలాంటి మోసగాడి గురించి ఎప్పుడు హెచ్చరిస్తునే ఉంటాం. నా భర్త రాహుల్ పోలీసులకు కంప్లయింట్ చేయడంతో వారిని ఇప్పటికే హెచ్చరించారు. దాంతో ఫేస్‌బుక్‌లో తన అకౌంట్‌ను డిలీట్ చేసి మళ్లీ దానిని పునరుద్దరించాడు. ఆడిషన్స్ పేరుతో ఈసీఆర్ గెస్ట్ హౌస్‌లో మోసాలకు పాల్పడుతాడు అంటూ ఆమె ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X