twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైంగిక వేధింపుల అంశంపై వైరముత్తును మీడియా ప్రశ్నించదా? చిన్మయి మరో ట్వీట్

    |

    మీటూ ఉద్యమం పుణ్యమా అని దేశ వ్యాప్తంగా ఎంతో మంది మహిళలు, ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనల గురించి బయట పెట్టారు. ప్రముఖ సౌత్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద అక్టోబర్ 2018లో సోషల్ మీడియా ద్వారా జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు మీద సంచలన ఆరోపణలు చేశారు. కొన్నేళ్ల క్రితం ఆయన తనను లైంగికంగా వేధించిన విషయం బయట పెట్టారు.

    వైరముత్తు మీద ఆరోపణలు చేసిన దాదాపు సంవత్సరం తర్వాత చిన్మయి మరోసారి ట్విట్టర్లో అతడికి సంబంధించిన ప్రస్తావన తెస్తూ ట్వీట్ చేశారు. వైరముత్తు మీద ఆరోపణలు వచ్చినా ఆయన్ను మీడియా వారు ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అంశంపై ప్రశ్నించక పోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

    'వైరముత్తు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడించి దాదాపు సంవత్సరం అయింది. కానీ ఇప్పటి వరకు ఏ మీడియా సంస్థ, పత్రికల వారు ఆయన్ను దీని గురించి ప్రశ్నించలేదు. ఎంజె అక్బర్, వైర ముత్తు లాంటివారిని మీడియా ఎందుకు నిలదీయడం లేదు?' అంటూ చిన్మయి అసంతృప్తి వ్యక్తం చేశారు.

    Chinmayi Sripaada questioning the media about Vairamuthu sexual misconduct

    ప్రముఖులుగా వెలుగొందుతున్న వారిని మీడియా మీటూ అంశంపై ప్రశ్నించే సాహసం చేయడం లేదు. దీంతో వారు తప్పు చేసినప్పటికీ సక్సెస్ ఫుల్‌గా బయటపడుతున్నారు. తాము వేధింపులను గురయ్యాము అని చెప్పిన మహిళల పేర్లు రోజూ మీడియాలో మార్మోగిపోతున్నాయి. మీడియా తీరు ఇలా ఉంది అంటూ చిన్మయి వ్యాఖ్యానించారు.

    ఇటీవల ఓ ఆంగ్లపత్రిక వైరముత్తును ఇంటర్వ్యూ చేసింది. ఆయనపై మీటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసి కూడా ఇందుకు సంబంధించి ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు. ఈ నేపథ్యంలో తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ చిన్మయి ట్వీట్ చేశారు.

    English summary
    Chinmayi Sripaada questioning the media about Vairamuthu sexual misconduct. Chinmayi wrote, "Let me reiterate this. Almost a year since my outing Vairamuthu as a molester. Not ONE Newspaper or Publication has asked him ANY questions. How do the MJ Akbar’s and Vairamuthus escape any and All questions, get mollycoddled and party with the powerful? None of it makes sense."(sic).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X