అది బ్రా కాదు, నీచంగా మాట్లాడొద్దు: సింగర్ చిన్మయి ఆవేదన
#మీటూ ఉద్యమంలో సౌత్ సినీ ఇండస్ట్రీలో సింగర్ చిన్మయి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు పేరు బయటపెట్టడంతో పాటు... తన కొలీగ్స్‌ను లైంగికంగా వేధించిన రఘు దీక్షిత్ లాంటి వారి పేర్లను సైతం ఆమె ధైర్యంగా బయట పెట్టారు.
మీటూపై సింగర్ చిన్మయికి పలువురు తమిళ సెలబ్రిటీలు, మహిళా సంఘాలు మద్దతు ఇస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరు తమిళ జనాలు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ విషయంలో విమర్శలు చేస్తూ మీమ్స్ సర్క్యులేట్ చేస్తున్నారు.

సింగర్ అంటే ఇలా ఉండాలి
సింగర్ అంటే ఇలా చీర కట్టుకుని పద్దతిగా ఉండాలి అంటూ చిన్మయి మీద.... సోషల్ మీడియాలో మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇందులో చీరకట్టులో ఉన్న పలువురు సింగర్స్ ఓ వైపు, టీ షర్టులో ఉన్న చిన్మయి ఫోటో మరో వైపు పెట్టి మీమ్స్ క్రియేట్ చేశారు.

నీచమైన కామెంట్స్
ఆ ఫోటోల చిన్మయి తన బ్రా స్ట్రిప్స్ బయటకు కనిపించేలా అసభ్యంగా డ్రెస్సింగ్ వేసుకుందంటూ సర్కిల్ చేసి మరీ చూపించారు. నువ్వు ఎవరితో అయినా పడుకోవడానికి సిద్ధంగా ఉంటావు అంటూ నీచమైన కామెంట్స్ చేశారు.

చిన్మయి రియాక్షన్
తనపై సర్క్యూలేట్ అవుతున్న మీమ్స్ మీద చిన్మయి రియాక్ట్ అయ్యారు. డ్రెస్సింగ్ విషయంలో మీరు ఇలానే ఉండాలి అని చెప్పడం సరికాదని అవేదన వ్యక్తం చేశారు. ముందు మగాళ్ల ఆలోచన తీరులో మార్పు వచ్చినపుడే మహిళలపై లైంగిక వేధింపులు తగ్గుతాయని అన్నారు.
బాబూ అది ‘బ్రా’ కాదు
నేను ‘బ్రా' లేస్ కనిపించేలా డ్రెస్సింగ్ చేసుకున్నట్లు సర్కిల్ చేసి మరీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ అది బ్రా కాదు. మెడ నొప్పి నుంచి ఉపశమనం కోసం ధరించే షోల్డర్ బ్రాస్.... అని చిన్మయి స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











