twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింగర్ చిన్మయి మీద వేటు: #మీ టూ ఉద్యమం ఎఫెక్టేనా? మంచు లక్ష్మి సపోర్ట్!

    |

    తమిళనాడుకు చెందిన ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కొన్ని రోజులుగా #మీటూ ఉద్యమం చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిన్మయిని యూనియన్ నుంచి తొలగిస్తూ తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్టుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాలుగా సభ్యత్వ రుసుము చెల్లించలేదనే సాకుతో ఆమెను తప్పించారు.

    గత రెండు నెలలుగా చిన్మయి మీటూ ఉద్యమం చేస్తూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖు తమిళ రచయిత వైరముత్తు తనను లైంగిక వేధించినట్లు ఆరోపించారు.

    #మీటూ: గదికి రమ్మంటే తప్పేంటి? అతడు మగాడు, కోరికలుంటాయి...#మీటూ: గదికి రమ్మంటే తప్పేంటి? అతడు మగాడు, కోరికలుంటాయి...

    ఆతర్వాత ఇద్దరు మహిళలు సౌత్ ఇండియన్ సినీ, టీవీ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ రాధా రవిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా... చిన్మయి వారికి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెను డబ్బింగ్ అసోసియేషన్ నుంచి తొలగించడం చర్చనీయాంశం అయింది.

    ఎలాంటి నోటీసులు లేకుండా

    ఎలాంటి నోటీసులు లేకుండా

    ప్రస్తుతం యూఎస్ఏ ఉన్న చిన్మయి... ఈ విషయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనతో ఎలాంటి చర్చలు జరుపుకండా, రాతపూర్వకమైన నోటీసులు పంపకుండా కేవలం ఒక మెసేజ్ పంపి తనను యూనియన్ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

    అదే ఆమె చివరి సినిమా

    అదే ఆమె చివరి సినిమా

    డబ్బింగ్ యూనియన్ మెంబర్‌షిప్ లేకుండా తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పడానికి అనుమతించరు. ఆమె చివరగా తమిళంలో ‘96' సినిమాలో త్రిష పాత్రకు డబ్బింగ్ చెప్పారు. యూనియన్లోకి ఆమెను తిరిగి తీసుకోకుంటే ఇదే ఆమె తమిళంలో డబ్బింగ్ చెప్పిన చివరి సినిమా అవుతుంది.

    మీటూ ఉద్యమం ఎఫెక్టేనా?

    మీటూ ఉద్యమం ఎఫెక్టేనా?

    అయితే చిన్మయి డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం రద్దు చేయడం వెనక అనేక రాజకీయాలు ఉన్నాయని, మీటూ ఉద్యమం చేస్తున్న చిన్మయిపై కవాలనే ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారనే వాదన సైతం వినిపిస్తోంది.

    మంచు లక్ష్మి మద్దతు

    డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం కోల్పోయిన చిన్మయికి... తెలుగు నటి మంచు లక్ష్మి మద్దతు ప్రకటించారు. వారు ఇలా చేసి ఉండకూడదని, ఇది చాలా దారుణమైన చర్యగా ఆమె పేర్కొన్నారు.

    English summary
    Singer, dubbing artist Chinmayi Sripaada has, apparently, been terminated from the Tamil Nadu dubbing union citing non-payment of the ‘subscription fees’ for the past two years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X