రైతుల గురించి తీయడం గర్వంగా ఉంది: చినబాబు ఆడియో వేడుకలో కార్తి
కార్తీ, సయేషా హీరో హీరోయిన్లుగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరక్కిన చిత్రం "చినబాబు". ఈ చిత్రాన్ని కార్తి సోదరుడు, ప్రముఖ సౌత్ హీరో సూర్య తన సొంత బేనర్ 2డి ఎంటర్టైన్మెంట్స్‌పై నిర్మించారు. ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తి రైతు పాత్రలో కనపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా ప్రమోషన్లో భాగంగా వైజాగ్‌లో ఆడియో రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. తమిళంలో కడైకుట్టి సింగం పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో 'చినబాబు' పేరుతో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్లో మిరియాల రవీందర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.
రైతుల గురించి తీసిన సినిమా: సూర్య
"రైతుల గురించి చినబాబు సినిమాను నిర్మించడం జరిగింది. అందరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. తమ్ముడితో సినిమా చెయ్యడం కల నిజం అయినట్లు ఉంది. సింగం3 సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్ వచ్చాను అప్పుడు మీరు చూపించిన ప్రేమ మర్చిపోలేను. నా కంటే కార్తీ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్న. కలలు కనండి వాటిని సాధించండి. పాజిటివ్ గా ఉంటె అన్నీ సాధ్యం అవుతాయి. చినబాబు అందరికి నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని తెలిపారు.
ఇలాంటి సినిమా చేయడం గర్వంగా ఉంది: కార్తి
"రైతును మర్చిపోతున్న సమయంలో రైతును గుర్తుచేసుకొనే విధంగా సినిమా చెయ్యడం గర్వంగా ఉంది. అన్నయ్య సూర్య ఈ సినిమా చూసి మెచ్చుకోవడం జరిగింది. జులై లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరు కలిసి ఉండాలని చెప్పే సినిమా ఇది. ఈ సినిమా చూశాక మీరు మీ అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లికి ఫోన్ చేసి మాట్లాడుతారు" అని కార్తి తెలిపారు.
దర్శకుడు పాండిరాజ్ ఫన్నీ స్పీచ్
చినబాబు సినిమాపై తమిళ్ లో ఎంతటి అంచనాలు ఉన్నాయో తెలుగులో అంతే అంచనాలు ఉన్నాయి. సూర్య, కార్తీ ఈ స్క్రిప్ట్ ఓకే చెయ్యడంతోనే ఈ సినిమా సగం సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో యాక్షన్, ఫ్యామిలీ, లవ్ ఉన్నాయి. అందరికి నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోంది.

చినబాబు
ఈ చిత్రంలో కార్తీ, సయేష, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను తదితరులు నటించారు.
సాంకేతిక నిపుణులు:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి
బ్యానర్స్: 2డి ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్
సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్.
సంగీతం: డి.ఇమాన్
కెమెరామెన్: వేల్ రాజ్
ఎడిటింగ్: రుబన్


Click it and Unblock the Notifications











