‘చిన బాబు’ మూవీ సీన్ కేక: రైతు గురించి గొప్పగా... విజయ్ దేవరకొండ సపోర్ట్!

By Bojja Kumar

Recommended Video

చిన బాబు’ మూవీ సీన్ కేక: రైతు గురించి గొప్పగా!!

కార్తీ, సయేషా హీరో హీరోయిన్లుగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరక్కిన చిత్రం "చినబాబు". ఈ చిత్రాన్ని కార్తి సోదరుడు, ప్రముఖ సౌత్ హీరో సూర్య తన సొంత బేనర్ 2డి ఎంటర్టైన్మెంట్స్‌పై నిర్మించారు. ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తి రైతు పాత్రలో కనపించబోతున్నారు. జులై 13న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఓ ప్రమోషనల్ వీడియో విడుదల చేశారు.

రైతు గురించిన డైలాగ్ అదిరిపోయింది

ఈ వీడియోలో కార్తి రైతు గురించి, రైతు పడే కష్టం గురించి చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది. ‘ఒక్క రోజు రైతులా ఉండి చూడు.. వద్దులే, ఒక్క రోజు రైతుతో ఉండి చూడు' అనే డైలాగ్‌ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

విజయ్ దేవరకొండ సపోర్ట్

ఈ సినిమా ప్రమోట్ చేయడంలో విజయ్ దేవరకొండ తనవంతు సపోర్ట్ అందించారు. ‘మా తాతలు రైతులు, నా 4వ తరగతి వరకు మా నాన్న కూడా రైతే. మళ్లీ తిరిగి వ్యవసాయం వైపు వెళ్లాలి అనేది ఆయన కల.... అంటూ ట్వీట్ చేశారు.

వీడియో షేర్ చేసిన విజయ్

నా అభిమాన నటుడు నటించిన, నా ఫేవరెట్ స్టార్ నిర్మించిన సినిమా ‘చినబాబు'... అలాంటి సినిమాకు సంబంధించిన స్నీక్ పీక్ వీడియోను విడుదల చేయడం ఆనందంగా ఉంది అంటూ విజయ్ పేర్కొన్నారు.

మీ నుండి చాలా క్రమశిక్షణ నేర్చుకోవాలి

ఈ సందర్భంగా హీరో సూర్య విజయ్ దేవరకొండను అభినందించారు. దీనికి అర్జున్ రెడ్డి స్టార్ రిప్లై ఇస్తూ... ‘మీ నుంచి కాస్త క్రమశిక్షణ నేర్చుకోవాలి' అంటూ కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X