పెద్ద ఎన్టీఆర్ పాటకు జూ ఎన్టీఆర్ డాన్స్ మరోసారి..!
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గతంలో పలు సినిమాల్లో తన తాత పెద్ద ఎన్టీఆర్ సినిమాల్లోని పాటలకు స్టెప్పులేసి థియేటర్లను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జూనియర్ మరోసారి సీనియర్ ఎన్టీఆర్ పాటకు స్పెప్పులు వేయబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో ఇది చేయబోతున్నారు.
ఈ మేరకు సీనియర్ ఎన్టీఆర్-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ఆరు సూపర్ హిట్ సాంగులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ ను దర్శకుడు హరీష్ శంకర్ ఈ మేరకు మంచి సాంగును సెలక్ట్ చేసి రీమిక్స్ చేయాల్సిందిగా పురమాయించినట్లు ఫిల్మ్ నగర్ టాక్.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రానికి డబ్బింగ్ చెప్పే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం విడుదల తర్వాత హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాకు పూర్తి సమయం కేటాయించనున్నాడు. త్వరలో షూటింగ్ షెడ్యూల్ ఖరారు కానుంది. ప్రొడక్షన్ టీం అందుకు సంబంధించిన పనిలో నిమగ్నమై ఉన్నారు.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తుండగా, శృతి హాసన్ స్పెషల్ రోల్ చేస్తోంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











