నితిన్ సినిమాలో పవన్ ఉన్నాడు, కానీ....
హైదరాబాద్: నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చిన్నదాన నీకోసం' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా రిలీజవుతోంది. ‘తొలి ప్రేమ' ఫేం కరుణాకరణ్ దర్శకత్వం కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఉంటుందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.
ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్
దీంతో పవర్ స్టార్‌ను చూసేందుకు ఆయన అభిమానులు భారీగా నితిన్ సినిమాకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా పవర్ స్టార్ అప్పియరెన్స్ పై నితిన్ క్లారిటీ ఇచ్చారు. సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం లేదని, కేవలం పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి' చిత్రంలోని ఫుటేజి మాత్రమే సినిమాలో వాడుతున్నామని తెలిపారు.

నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో, అభిమానమో అందరికీ తెలిసిందే. ఆ అభిమానంతోనే ఆయన సినిమాకు సంబంధించిన ఫుటేజీని సినిమాలో వాడుతున్నాను. చిన్నదాన నీకోసం సినిమా నా గత సినిమాలకంటే భిన్నంగా ఉంటుంది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు.
శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ‘చిన దాన నీకోసం' చిత్రాన్ని ఆయన సోదరి నిఖితా రెడ్డి తెరకెక్కిస్తున్నారు. నితిన్ సరసన మిష్టి చక్రవర్తి నటిస్తోంది. సాఫ్ట్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పించే కరుణాకరన్, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











