నితిన్ ‘చినదాన నీకోసం’...(ఫన్నీ మేకింగ్ వీడియో)
హైదరాబాద్: నితిన్ హీరోగా శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ‘చిన దాన నీకోసం' చిత్రం ఆయన సోదరి నిఖితా రెడ్డి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమా గురించి నిఖితా రెడ్డి మాట్లాడుతూ... ‘ప్రేమ, వినోదం, కుటుంబ బంధాలు కలగలిపిన కథ ఇది. కోరుకున్న అమ్మాయి కోసం కథానాయకుడు ఏం చేసాడన్నది తెరపిస్తున్నామన్నారు. ఈచిత్రం విజయంపై పూర్తి నమ్మకం ఉందన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్
ఈ చిత్రానికి "అమృతం" ఫేం హర్షవర్థన్ మాటలు అందిస్తున్నాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలలకు సంగీతం అందించిన అనూప్ సంగీతాన్ని అందించారు. నితిన్ సరసన మిష్టి చక్రవర్తి నటిస్తోంది. సాఫ్ట్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పించే కరుణాకరన్, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్ గతంలో తన సినిమాల్లో పవర్ స్టార్ మార్కు ఉండేలూ చూసుకున్నాడు. ‘చినదాన నీకోసం' సినిమాలోనూ నితిన్ మరోసారి పవర్ కళ్యాణ్ మార్కు ఉండేలా ప్లాన్ చేసాడు. ఈ సినిమాలోని పాటల్లో, సీన్లలో, నితిన్ స్టైల్ లో మొత్తం పవన్ కళ్యాణ్ ఛాయలే కనిపిస్తుండటం గమనార్హం. ఇక ఈ సినిమాలోని నితిన్ ఇంట్రడక్షన్ సాంగ్....గుడుంబా శంకర్, ఖుషి చిత్రాల్లోని పాటల్లా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్లో కూడా నితిన్ పవన్ నామ స్మరణ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











