పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే స్పెషల్ షో
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమయం కేటాయిస్తే ‘చిన దాన నీకోసం' స్పెషల్ షో ఆయనకు చూపిస్తామని అంటున్నారు నిర్మాత నిఖిత రెడ్డి. తన సోదరుడు నితిన్ హీరోగా శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ‘చిన దాన నీకోసం' చిత్రం తెరకెక్కించారామె. ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది.
శనివార ఆమె మీడియాతో మాట్లాడుతూ...‘ప్రేమ, వినోదం, కుటుంబ బంధాలు కలగలిపిన కథ ఇది. కోరుకున్న అమ్మాయి కోసం కథానాయకుడు ఏం చేసాడన్నది తెరపిస్తున్నామన్నారు. ఈచిత్రం విజయంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. అనుభవం గల దర్శకుడు కరుణాకరన్ తో పని చేయడం వల్ల ఎలాంటి టెన్షన్ లేకుండా చిత్రీకరన పూర్తయిందన్నారు.

ఈ చిత్రంలో నితిన్ పోషించిన పాత్ర పవన్ కళ్యాణ్ పోలికలో ఉంటుందా? అని ప్రశ్నించగా....ఆ విషయం సినిమా చూసి తెలుసుకోవాలని సమాధానం ఇచ్చారు నిఖిత రెడ్డి. తమ బేనర్లో మరిన్ని మంచి కథలు రూపొందిస్తామన్నారు. బయటి హీరోలతోనూ సినిమాలు తీస్తామని చెప్పారు.
కరుణాకరన్ దర్శకత్వం వహించగా "అమృతం" ఫేం హర్షవర్థన్ మాటలు అందిస్తున్నాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలలకు సంగీతం అందించిన అనూప్ సంగీతాన్ని అందిస్తున్నారు. నితిన్ సరసన మిష్టి చక్రవర్తి నటిస్తోంది. సాఫ్ట్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పించే కరుణాకరన్, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











