'బద్రినాథ్' కి దిష్టి ఎవరు కొట్టారు?
అల్లు అర్జున్, వివి వినాయిక్ కాంబినేషన్ లో 'బద్రినాథ్' చిత్రం రీసెంట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం యాభై రోజులు పూర్తి అయిన సందర్భంగా రచయిత చిన్ని కృష్ణ మాట్లాడుతూ... ఈ సినిమాకి దిష్టి తగలడం వల్లే మొదటి వారం రోజులు టాక్ నెగిటివ్ గా వచ్చిందనీ, వారం తర్వాత దిష్టి పోయిందనీ, అందుకే సినిమా ఇంత పెద్ద హిట్టయ్యిందనీ చెప్పాడు. ఈ మాట విన్న జనం ఇంతకీ బద్రీనాధ్ కీ దిష్టి ఎవరు కొట్టారు.. ఇంతకీ ఇప్పుడు దిష్టి పోయినట్లేనా అని అడుగుతున్నారు. ఎందుకంటే 'బద్రినాథ్' 187 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుందని చెప్పారు.
అయితే హైదరాబాద్ లో చూస్తే కేవలం నాలుగు సెంటర్లు మాత్రమే ఉన్నాయి. వాటికి కూడాకలెక్షన్స్ లేవని చెప్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక అదే సమయంలో దర్శకుడు వి వి వినాయిక్ కూడా.. ఇంత బాగా తీసిన సినిమాకి కూడా డివైడ్ టాక్ రావడమేమిటా అని ఎంతో బాధపడ్డా. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. అసలు డైరెక్షన్‌ని వదిలేసి పోవాలని అనుకున్నా. అయితే సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత పాజిటివ్ టాక్ మొదలై కలెక్షన్లు స్టడీ అయ్యాయి. అప్పుడు కానీ కుదుటపడలేకపోయా అన్నారు. అంటే ఆయన దృష్టిలోనూ సినిమా పెద్ద హిట్టు క్రింద లెక్కే.ఇంతకీ దిష్టి కొట్టింది ఎవరికి ప్రేక్షకులకా.


Click it and Unblock the Notifications











