For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సరిలేరు నీకెవ్వరూ రికార్డులు తిరగరాస్తుంది... కనీసం 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది’

  |
  Shakalaka Shankar Hilarious Speech At Akshara Movie Teaser Launch Event || Filmibeat Telugu

  హీరోయిన్ నందితశ్వేతా ప్రధాన పాత్రలో బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి నిర్మించిన చిత్రం 'అక్షర' ఈమూవీ టీజర్ లాంచ్ సక్సెస్ పుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి చేతులు మీదుగాజరిగింది. విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే అక్షర పోరాటం చాలాఆసక్తిగా సాగుతుంది. ఒక సీరియస్ పాయింట్‌ను తీసుకొని ఎక్కడా ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా రూపొందిచిన చిత్రం 'అక్షర'. నందిత శ్వేత లుక్స్‌కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింతదగ్గర అవుతుందని నమ్ముతుంది చిత్రయూనిట్. ఈ మూవీ టీజర్ లాంచ్ కి చిత్ర
  యూనిట్ తోపాటు ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, వరస విజయాలతో టాలీవుడ్ లోతనదైన ముద్రను వేసిన దర్శకుడు అనీల్ రావిపూడి పాల్గోన్నారు.

  అక్షర మూవీ ఓ సీరియస్ పాయింట్‌తో

  అక్షర మూవీ ఓ సీరియస్ పాయింట్‌తో

  ఈ సందర్భంగా దర్శకుడుబీ చిన్ని కృష్ణ మాట్లాడుతూ:
  ‘‘నేను చెప్పిన లైన్ విని దర్శకుడుగా నాకు ఈ అవకాశం కల్పించిన నిర్మాతలు సురేష్ వర్మ, అహితేజ లకు నా కృతజ్ఞతలు. ఇప్పటి వరకూ కామెడీ సినిమాలుచేసాను. కానీ ‘అక్షర' లో ఒక సీరియస్ పాయింట్ ని డిస్కస్ చేసాం. ఇంట్లో చదువుకొనే వ్యక్తి ఉంటే ఆ ఇళ్లు బాగుంటుంది అని చిన్ని కృష్ణ పేర్కొన్నారు.

  హిట్ కొడుతున్నావ్ అన్నారు

  హిట్ కొడుతున్నావ్ అన్నారు

  విద్యపై గవర్నమెంట్ పాలసీల మీద మాట్లాడాము. నా జీవితంలో ప్రత్యేక సినిమాగా ‘అక్షర'మిగులుతుంది. కథ చెప్పగానే సినిమాకు అంగీకరించి అక్షరకు పాత్రకు రూపంఇచ్చిన నందిత శ్వేత ప్రత్యేక ధన్యావాదాలు. పది నిముషాలు ఈ కథ వినగానే అనీల్ రావిపూడి హిట్ కొడుతన్నావ్ అని చెప్పాడు. విద్యావ్యవస్థకు ఉపయోగపడే సినిమా ఇది. ఈ చిత్రాన్ని విజయవంతం చేయండి అని చిన్నికృష్ణ అన్నారు.

  అనిల్ రావిపూడి నాకు మంచి మిత్రుడు

  అనిల్ రావిపూడి నాకు మంచి మిత్రుడు

  అనీల్ రావిపూడి నాకు మంచిమిత్రుడు. ఆయనకు, నా మధ్య ఉన్న బంధం ఎఫ్2 సినిమాలో తమన్నా, వెంకటేష్ లాంటి రిలేషన్. నేను అలిగితే బుజ్జగించడం చేస్తుండే వాడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచింది అనిల్ రావిపూడి మాత్రమే. అనీల్ బాగుంటే అందరూ బాగుంటారు. ఈ ఒక్కమాట చెప్పగలను అనీల్ గురించి. ఎడ్యుకేషన్ అందరికీ అందుబాటులో రావాలి. అదే అక్షర చేసే పోరాటంఅని చిన్నికృష్ణ అన్నారు.

  సరిలేరు నీకెవ్వరూ రూ.200 కోట్లు

  సరిలేరు నీకెవ్వరూ రూ.200 కోట్లు

  అక్షర సినిమా కార్యక్రమానికి అనిల్ రావిపూడి వచ్చాడు కాబట్టి.. ఈ వేదిక మీద నుంచి ఓ మాట చెప్పదలచుకొన్నాను. మహేష్ బాబుతో అనిల్ రావిపూడి తీసే సినిమా సరిలేరు నీకెవ్వరూ కథ విన్నాను. అద్భుతంగా ఉంటుంది. అనిల్ పెద్ద హిట్ కొడుతాడు. ఆ సినిమా కనీసం రూ.200 కోట్లు వసూలు చేస్తుంది అని చిన్నికృష్ణ అన్నారు.

  English summary
  Director Chinni Krishna's Latest movie is Akshara. Nandita Shweta is the heroine. This movie's teaser launched in hyderabad today. In this occasion, Director Chinni Krishna made sensational statement. He said, Mahesh's Sarileru Neekevaru movie will collect 200 crores.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X