తారకరత్న దెబ్బకు చిన్నికృష్ణ గోలెత్తిపోతున్నాడు
రీసెంట్ గా బద్రీనాధ్ చిత్రానికి కథ అందించిన స్టార్ రైటర్ చిన్ని కృష్ణ.ఆయన డ్రీమ్ ప్రాజెక్టు 'నందీశ్వరుడు'.ఈ టైటిల్ తో సినిమా చెయ్యాలనింగా ఆయన చాలా కాలంగా కలలు కంటున్నాడు.అయితే అనుకోని విధంగా తారకరత్న సీన్ లోకి వచ్చి ఆ టైటిల్ ని ఎత్తుకుపోయాడు.కన్నడంలో సూపర్ హిట్టయిన 'డెడ్లీ సోమా' అనే సినిమా ఆధారంతో. ఆగస్ట్ 25నే ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... 'నందీశ్వరుడు' టైటిల్ ఇచ్చిన పెద్దలకు థాంక్స్. 'డెడ్లీ సోమా' అనే కన్నడ ఈసినిమాలో లైన్‌ను మాత్రం తీసుకున్నాం. తారకరత్న పాత్రతో పాటు షీనా పాత్ర కూడా హైలైట్‌గా ఉంటుంది అని చెప్పాడు.
ఇంతకీ చిన్న కృష్ణకు ట్విస్ట్ ఇచ్చేలా టైటిల్ ఇచ్చిన పెద్దలు ఎవరూ అంటే... 'నరసింహనాయుడు' నిర్మాత మేడికొండ మురళీకృష్ణ. 'నందీశ్వరుడు' టైటిల్‌ని మేడికొండ చేత రిజిస్టర్ చేయించింది చిన్నికృష్ణే. అయితే ఆ టైటిల్‌ని ఈ మధ్యన రెన్యువల్ చేయించలేదు.దాంతో ప్రస్తుత 'నందీశ్వరుడు' నిర్మాతలు ఆ టైటిల్'ని చేజిక్కించుకున్నారు.ఈ ఎఫెక్టుతో చిన్నికృష్ణకి తీవ్ర నిరాశ ఎదురైంది. 'నందీశ్వరుడు' మొదలైందని తెలియగానే సన్నిహితుల వద్ద మేడికొండ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని వాపోయాడనీ తెలిసింది. అయితే తారకరత్నే ఈ టైటిల్ కావాలని పట్టుపట్టి మరీ తెచ్చుకున్నాడని కథనం.


Click it and Unblock the Notifications











