Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిన్నోడు సక్సెస్: నిర్మాతలు
శ్రీసాయి బాలాజీ ఆర్ట్స్ పతాకంపై యలమంచి శ్రీధర్ తొలి ప్రయత్నంగా నిర్మించిన చిన్నోడు చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోందని చిత్ర సమర్పకులైన కాట్రగడ్డ లోకేశ్ వెల్లడించారు. ఈ చిత్రం విజయం గురించి లోకేశ్, నిర్మాత శ్రీధర్ మీడియాతో ముచ్చటించి పలు విషయాలు చెప్పారు.
ఈ సినిమాని చాలా కష్టపడి తీశాం. 68 రోజులు షూటింగ్ చేశాం. మొత్తం యూనిట్ పడిన కష్టానికి మంచి ప్రతిఫలం లభించిందని ఇప్పుడు చెప్పగలం అన్నారు నిర్మాతలు. 105 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమాకి కలెక్షన్లు బాగుండటంతో పంపిణీదారులు మరిన్ని ప్రింట్ల కోసం అడుగున్నారని నిర్మాతలు చెప్పారు.
యలమంచి శ్రీధర్ ఈ చిత్రానికి డైలాగ్స్ కూడా రాశారు. నిర్మాతగా ఇది తనకు తొలి చిత్రమని, ఈ విజయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. ఈ చిత్రం కథ, కథనం అందరినీ ఆకట్టుకుంటోందని నిర్మాత తెలిపారు. బంధాలు, అనుబంధాలు అన్నవాటికి కాలం చెల్లుతున్న ఈ రోజుల్లో తనది కాని కుటుంబం కోసం హీరో పడిన శ్రమ, తనని పెంచిన వారి రుణం తీర్చుకోడానికి హీరో ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే ఉన్నతమైన క్యారక్టరైజేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నట్లు చెప్పారు.
ఇంతకు ముందు నా ఊపిరి చిత్రం ద్వారా మంచి దర్శకుడిగా గుర్తింపు పొందిన కణ్మణి చెప్పిన కథ విని, సుమంత్‌కి ఇది బాగా నప్పుతుందని భావించామని, తాము అనుకున్నట్టే ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరించడం చూస్తే తమ జడ్జిమెంట్ నిజమైందనిపిస్తోందని నిర్మాత శ్రీధర్ తెలిపారు. ఇంకా ఇందులో రమణ గోగుల అందించిన పాటలు బాగా పాపులర్ అయ్యాయని చెప్పారు. గౌరి చిత్రం తర్వాత సుమంత్, ఛార్మి కాంబినేషన్‌లో మరో హిట్ దక్కిందని నిర్మాతలు అన్నారు.
తమ సంస్థ ద్వారా తదుపరి చిత్రంగా నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో డిసెంబర్‌లో ఓ చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.