వెంకీ లేటెస్ట్ గడ్డం కథ

ఇక 'చింతకాయల రవి' ఎలా ఉండబోతున్నాడు? అంటే..అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. పల్లెటూరు నుంచి వెళ్లినవాడు. ఎప్పుడూ సరదాగా ఉంటాడు. అలాగని అల్లరిచిల్లరివాడేమీ కాదు. బాధ్యతలు తెలిసినా - అప్పుడప్పుడూ వాటిని మరిచిపోయి కొన్ని ఘన కార్యాలు చేస్తుంటాడు. స్త్టెల్స్‌కి ఏ మాత్రం తక్కువ ఉండదు. ఇది నా పాత్ర. కథ విషయానికొస్తే సున్నితమైన చిన్న అంశం. అమెరికాలోనే ఎక్కువ భాగం నడుస్తుంది. నా గత చిత్రాల్లాగే ఇంటిల్లిపాదీ హాయిగా చూడొచ్చు.
ఇక టైటిల్ గురించి మాట్లాడుతూ కథ చెప్పేటప్పుడు పాత్ర పేరు చెప్పే పత్రిసారీ చింతకాయ రవి అనేవారు. అదే టైటిల్ అయితే బాగుంటుంది కదా అంటే దాన్నే ఖరారు చేశారు. అందరూ భలే ఉంది అన్నారు.అని ధీమాగా చెప్తున్నారు వెంకటేష్.ఇక అనూష్క,మమతామోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం అక్టోబర్ ఒకటవ తేదీన రిలీజ్ కాబోతోంది. ఓం శాంతి ఓం ఫేమ్ విశాల్ -శేఖర్ అందించిన సంగీతం ఇప్పటికే మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఫన్నీ ఎంటర్ టైనర్ ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. కొత్త గెడ్డం,గెటప్ లలో కనిపించే ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చెయ్యాలని కోరుకుందాం...


Click it and Unblock the Notifications











