'చింతకాయల రవి' స్టోరీ లైన్ ఏమిటంటే...

By Staff

Chintakayala Ravi
ఈ దసరా ఫెస్టివల్ లో థియేటర్స్ ని నవ్వుల్లో ముంచెత్తటానికి చింతకాయల రవి రంగంలోకి దూకుతున్నాడు. ఈ చిత్రం గురించి రెండు కథలు ఫిల్మ్ నగర్ లో ప్రచారంలో ఉన్నాయి. అవమిటంటే టాగ్ లైన్ సాప్ట్ వేర్ ఇంజనీర్ ప్రకారం ఈ చిత్రంలో వెంకీ సాప్ట్ వేర్ జాబ్ నిమిత్తం అమెరికా వెళ్ళతాడుట. రాజమండ్రి నుండి బయిలు దేరిన అతనికి అక్కడ అనుకోని పరిణామాలు ఎదురయ్యి ఓ రెస్టారెంట్ లో పనిచేయాల్సి వస్తుంది.

తన కొడుకు అమెరికా లో ఉన్నాడని అతనికి పెళ్ళి సంభందాలు చూస్తూంటారు.ఆ క్రమలో అక్కడే ఉన్న హీరోయిన్ కి వెంకీ ఎడ్రస్ ఇస్తారుట. అతను తన విషయం బయట పడిపోతుందని తన ప్రెండ్ తొట్టెంపూడి వేణు ని తన ప్లేసులో పెళ్ళి చూపులకు పంపుతాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ అమ్మాయి కూడా తన ప్లేసులోకి వేరే అమ్మాయిని పంపుతుందిట. అలా వేణు ఆ అమ్మాయి ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇలా ఈ నాటకం కొనసాగి...అసలు హీరో..హీరోయిన్స్ ఎలా కలసారు అనేది కథ అని ఓ స్టోరీ ప్రచారంలో ఉంది.

అలాగే మరో కథ కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో పరుగెడుతోంది. దాని ప్రకారం వెంకటేష్ రాజమండ్రి నుండి అమెరికా వెళ్ళి అక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగం దొరక్క రెస్టారెంట్ లో పనిచేస్తూ తన ఇంటి వద్ద వారికి అబద్దం చెప్తూంటాడు. అక్కడే ఓ హీరోయిన్ గొడవ పడి పరిచయమవుతుంది. ఆ క్రమంలో రవికి ఓ సంభందం ఇంటి దగ్గరవారు చూస్తారు. ఆ పెళ్ళికూతురు తన అమెరికా ఫ్రెండ్ కి ఈ విషయం చెబుతుంది. అయితే ఆ ఫ్రెండ్ అమెరికాలో చాలా మంది మోసం చేస్తున్నారని పెళ్ళికొడుకు ఫొటో పంపమని అంటుంది. ఆమె మరెవరో కాదు వెంకీ తో గొడవ పడ్డ అమ్మాయి. దాంతో అసలు విషయం బయిటపడిపోతుంది. ఈ విషయం తెలియని వెంకీ పెళ్ళి నిమిత్తం ఇండియా వచ్చి అందరిలో అవమానపడతాడు.తర్వాత మళ్ళి అమెరికా వెళ్ళి తను గొడవ పడ్డ మొదట అమ్మాయితో ఎలా ప్రేమను పండిచుకున్నాడనేదే అంటున్నారు.

ఇక మొదట అనుకున్నట్లుగా చింతకాయిల రవి చిత్రం రిలీజ్ ని అక్టోబర్ ఒకటిన కాకుండా మరుసటి రోజుకి వాయిదా వేశారు. అనూష్క,మమతా మోహన్ దాస్ జంటగా కన్పించనున్న ఈ సినిమాలో వెంకటేష్ ..చింతకాయల రవి గా కన్పించనున్నారు.భారీ ఓపినింగ్స్ తో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X