చిరంజీవి మాట లెక్కచేయని నాగబాబు.. కోపంతో మెగాస్టార్ మందలింపు! మెగా సెన్సేషన్

మెగా ఫ్యామిలీ హీరోల్లో ముగ్గురూ మొనగాళ్లే. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎవరికీ వారు ప్రత్యేకమే. ఈ ముగ్గురూ ఒకరంటే ఒకరు ప్రాణానికి ప్రాణంగా ఉంటూ అన్నదమ్ముల బంధానికి చిరునామా అనేలా వ్యవహరిస్తుంటారు. తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్.. అన్నయ్య చిరంజీవి పట్ల ఎంతో ఆప్యాయంగా ఉంటారు. కాగా తాజాగా ఓ సందర్భంలో చిరంజీవి మాటలెక్క చేయలేదట నాగబాబు. దీంతో కోపం వచ్చిన చిరు ఆయన్ను మందలించడం జరిగిందట. ఆ వివరాలపై ఓ లుక్కేద్దామా..

మెగా ఫ్యామిలీ కీలక వ్యవహారాల్లో నాగబాబు

మెగా ఫ్యామిలీ కీలక వ్యవహారాల్లో నాగబాబు

వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల విందు పంచుతూ జబర్దస్త్ చేస్తున్నారు నాగబాబు. అన్నయ్య చిరంజీవితో పాటు సినిమాల్లో రాణిస్తూనే మెగా ఫ్యామిలీకి సంబంధించిన కీలక వ్యవహారాలను లీడ్ చేస్తుంటారు నాగబాబు. వ్యక్తిగతంగా వెండితెర, బుల్లితెర రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే గాక అన్నయ్య చిరంజీవికి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి సహాయ సహకారాలు అందిస్తుంటారు ఈ మెగా బ్రదర్.

అన్నయ్యంటే ప్రాణం.. కానీ, నాగబాబును కొట్టాల్సిన పరిస్థితి

అన్నయ్యంటే ప్రాణం.. కానీ, నాగబాబును కొట్టాల్సిన పరిస్థితి

మెగా బ్రదర్ నాగబాబుకు తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణం. ఆ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ఏ విషయంలో అయినా తన అన్నయ్య చిరంజీవిని స్ఫూర్తిగా చెబుతుంటారు నాగబాబు. అయితే ఓ సారి అదే అన్నయ్య చిరంజీవి, నాగబాబును కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందట. ఈ విషయాన్ని చిరుయే వెల్లడించారు.

నాగబాబు అలసత్వం.. ఇలా జరగడంతో

నాగబాబు అలసత్వం.. ఇలా జరగడంతో

తాను ఇంటర్ చదువుతున్నపుడు నాగబాబు ఏడో తరగతిలో ఉన్నాడని చెప్పిన చిరు.. ఓ సందర్భంలో నా మాట వినకపోవడంతో మందలించానని అన్నారు.
ఆ రోజుల్లో ఇంట్లో పనులు ఎక్కువగా తానే చూసుకునే వాడినని, కానీ ఓ రోజు చైనా పని చెప్పినా నాగబాబు అలసత్వం ప్రదర్శించడంతో తనకు కోపం వచ్చి కొట్టానని చెప్పారు చిరంజీవి.

అమ్మ తిట్టడంతో ఇలా చేశా.. ఏడుస్తూనే!

అమ్మ తిట్టడంతో ఇలా చేశా.. ఏడుస్తూనే!

అయితే తాను నాగబాబును అలా కొట్టడం చూసి.. చిన్నోడిని అలా కొడతావా? అంటూ అమ్మ తిట్టిందని చెప్పారు చిరంజీవి. దీంతో సాయంత్రం నాన్న ఇంటికి రాగానే ఏడుస్తూ విషయం అంతా చెప్పానని, అప్పుడు నాన్న వెళ్లి నాగబాబును మందలించడంతో అప్పుడు రిలాక్స్ అయ్యానని తెలిపారు చిరు.

సైరా చిరంజీవి.. ఇక త్రిషతో

సైరా చిరంజీవి.. ఇక త్రిషతో

ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి తన 152వ సినిమాను కొరటాలశివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. చిత్రంలో చిరు సరసన త్రిష పేరును పరిశీలనలో పెట్టినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X