చిరంజీవి 150వ చిత్రం అటకెక్కినట్లేనా?

అయితే టాలీవుడ్ లో మాత్రం చిరు 150 చిత్రంగా గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంది. చిరంజీవి ఊయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథపై ఆసక్తి చూపుతున్నాడని, పూరి, వివివినాయక్, శంకర్, మురుగదాస్ లలో ఎవరో ఒకరి దర్శకత్వంలో చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో....గురువారం నెల్లూరు వచ్చిన చిరంజీవిని తన 150వ సినిమా గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.....తన సినీ ప్రస్థానాన్ని చరణ్ భర్తీ చేస్తాడని, చరణ్ లోనే అభిమానులు నన్ను చూసుకోవాలని చూసించారు. చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇక 150 సినిమా ఉండదనే వాదనకు బలం చేకూరినట్లవుతోంది.


Click it and Unblock the Notifications











