ఆగస్టులోనే: 150వ సినిమాపై చిరంజీవి ప్రకటన

By Bojja Kumar

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా త్వరలో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. అయితే సినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతోందనే విషయమై మాత్రం ఇప్పటి వరకు సరైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో శనివారం కడప జిల్లా పర్యటనలో భాగంగా రైల్వే కోడూరు వచ్చిన చిరంజీవి ఈ సందర్భంగా ఈ విషయమై స్పందించారు.

150వ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు, ఆగస్టులో సినిమా ప్రారంభం అవుతుందని అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు రామ్ చరణ్ తో పాటు బండ్ల గణేష్ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటారని తెలిపారు. ఆగస్టులో అంటే చిరంజీవి జన్మదినం రోజు ప్రారంభం అవుతుందని స్పష్టం అవుతోంది. 150వ సినిమాపై స్వయంగా చిరంజీవి స్పందించడంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈచిత్రానికి ప్రస్తుతం ‘ఆటోజానీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించబోతున్నారు. సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ... ఈ స్టోరీ నేను ఇప్పటికే విన్నాను. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇది పూర్తి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ అయిన కథ అని రాంచరణ్ తెలిపారు. ఇలాంటి చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం దక్కినా అదృష్టంగానే భావిస్తానని చరణ్ చెప్పుకొచ్చాడు.

Chiranjeevi 150th film launch on August

సినిమాను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం ఉందని, నిర్మాతగా తన మొదటి సినిమా చేయడానికి ఎంతోమంది ప్రెజర్ ఫీలయ్యారని, కానీ పూరీ జగన్నాథ్ ఒక్కడే కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పాడు. పూరీకి ఈ కథమీద మంచి పట్టుందని, టోటల్ గా‌ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెర్రీ అన్నాడు.

కాపీ వివాదం... చిరంజీవి 150వ సినిమా ప్రకటన అలా వచ్చిందో లేదో...ఇలా వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం స్టోరీ కాపీ కొట్టారంటూ వివాదం నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఆటోజానీ స్టోరీ పూర్తిగా నేను ఒరిజినల్ గా తయారు చేసినల్ స్టోరీ. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేసారు. పూరి స్వయంగా వివరణ ఇవ్వడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X