చిరంజీవి న్యూలుక్: 150వ కోసమే.. (ఫోటోస్)
హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా త్వరలో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మరి సినిమా అంటే గ్లామర్‌గా కనిపించాలి. ఫిజిక్, పర్సనాలిటీ పరంగా పర్ ఫెక్టుగా ఉండాలి. పాత్రకు తగిన విధంగా హాండ్సమ్ లుక్ తో అదర గొట్టాలి. ఇందుకోసం గత కొన్ని రోజులుగా చిరంజీవి కసరత్తు చేస్తున్నారు.
రాజకీయాల్లో ఉన్నంత కాలం తన గ్లామర్ గురించి పెద్దగా పట్టించుకోని చిరంజీవి....150వ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాక ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొన్ని రోజులుగా ప్రత్యేకమైన డైట్ తీసుకోవడంతో పాటు, జిమ్ చేస్తూ ఫిట్ నెస్ పై దృష్టి సారించారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా 150వ సినిమా ప్రకటించే అవకాశం ఉంది.
తాజాగా చిరంజీవి న్యూలుక్ ఫోటోలు విడుదలయ్యాయి. 150వ సినిమా కోసమే చిరంజీవి ఇలా కొత్తగా తయారయ్యారని టాక్. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు.

చిరంజీవి న్యూ లుక్
చిరంజీవి న్యూలుక్ చూస్తుంటే మళ్లీ సినిమాల్లో అదరగొడతారని స్పష్టమవుతోంది.

ప్రతిష్టాత్మకం
150వ సినిమా కావడం, రాజకీయాల తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో ఈచిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత కొంతకాలంగా కథ గురించి చాలా అన్వేషణ జరిగింది. బెస్ట్ స్టోరీ కోసం చాలా కథలు పరిశీలించారు.

సందేశం కంటే వినోదానికే పెద్దపీట
తన 150వ సినిమా సందేశాత్మకంగా ఉండటం కన్నా.....ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్టెన్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నారట.

దర్శకుడు ఎవరు?
చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు ఎవరనే దానిపై ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. వివి వినాయక్ పేరు, బోయపాటి శ్రీను పేర్లు వినిపించాయి. వివి వినాయక్ ఫైనల్ అయినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఇపుడు 150వ సినిమా బాధ్యతలు దర్శకుడు కృష్ణవంశీకి అప్పజెప్పాడని అంటున్నారు.

తేలేది ఎప్పుడంటే?
ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు. ఈ రోజు చిరంజీవి 150వ సినిమాపై పూర్తి క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











